బాలీవుడ్ క్వీన్ కరీనా కపూర్ కు పోటీగా శ్రుతి హాసన్, రాఖీభాయ్ దెబ్బకు స్క్రీన్ షేక్ అవుతుందా !

శ్రుతి హాసన్ కమల్ హాసన్ కూతురుగానే కాకుండా ఆమె కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. తమిళ, తెలుగు, హిందీ సినిమాల్లో నటిస్తున్న శ్రుతి హాసన్ ఆమె కంటే ప్రత్యేక ఇమేజ్ సంపాధించుకున్నారు. నటిగానే కాకుండా సింగర్ గా కూడా శ్రుతి హాసన్ గుర్తింపు తెచ్చుకున్నారు. 2017లో కన్నడ సినిమాల్లో నటించే ఆలోచన కాని, అలాంటి ఆశ కాని తనకు ఏమాత్రం లేదని శ్రుతి హాసన్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

అప్పట్లో శ్రుతి హాసన్ ఇచ్చిన స్టేట్ మెంట్ తో కన్నడిగుల టార్గెట్‌కు గురైన ఆమె సినిమాలు ఎవ్వరూ చూడకూడదని కొన్ని కన్నడ సంఘాలు కన్నడిగులకు మనవి చేశారు. ఆ తర్వాత కన్నడిగులు దర్శకత్వం వహించి నిర్మించిన సాలార్ సినిమాలో శ్రుతి హాసన్ నటించడానికి సిద్దం కావడం అప్పట్లో హాట్ టాపిక్ అయ్యింది. నిజానికి సాలార్ సినిమాల ద్వారా శ్రుతి హాసన్ కు రావాల్సిన పేరు ఏమాత్రం రాలేదు అనే విషయం జగమెరిగిన సత్యం.

Shruti Haasan will play the heroine in the movie Toxic starring Yash as the hero

అయితే శ్రుతి హాసన్ కు సాలార్ 2 సినిమా ఏమైనా గుర్తింపు తెస్తుందా అని ఆమె అభిమానులు ఎదురుచూసే అవకాశం ఉంది. అయితే ఆ మధ్య శృతిహాసన్ మరో కన్నడ సినిమాలో నటిస్తోందని వెలుగు చూడటం హాట్ టాపిక్ అయ్యింది. ఆ సినిమా పేరు టాక్సిక్. ప్రస్తుతం స్యాండిల్ వుడ్ లో అలాంటి వార్తే వినిపిస్తోంది. ఇటీవలే కరీనా కపూర్ టాక్సిక్‌లో హీరోయిన్‌గా నటిస్తుందనే టాక్‌ మొదలైయ్యింది. తాను సౌత్‌ ఇండియాలోని ఓ బిగ్గెస్ట్ మూవీలో ఒక పార్ట్ అవుతున్నానని కరీనా కపూర్ స్వయంగా చెప్పారు.

కరీనా కపూర్ ఓ టీవీ చానల్ తో మాట్లాడుతూ తాను సౌత్ ఇండియా సినిమాలో నటిస్తున్నానని చెప్పడంతో ఆ భారీ సినిమా టాక్సిక్ అని అందరూ అంచనా వేశారు. ఇప్పుడు టాక్సిక్ సినిమాలో ఒక‌రు కాదు, ఇద్ద‌రు హీరోయిన్లు ఉన్న‌ట్టు వార్త‌లు వ‌చ్చాయి. శ్యాండిల్ వుడ్ రాఖీభాయ్ కొత్త సినిమా టాక్సిక్ లో శృతిహాసన్‌తో పాటు కరీనా కపూర్ కూడా నటిస్తుందనే వార్త దావానలంలా వ్యాపించింది. ఇప్పటికీ శృతి హాసన్ హీరోయిన్ గానే కాకుండా సింగర్ కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు

ఇటీవల విడుదలైన టాక్సిక్ సినిమా టీజర్ కోసం శ్రుతి హాసన్ తన గొంతు వినిపించింది. అందుకే ప్రస్తుతం శృతి హాసన్ టాక్సిక్ చిత్రంలో నటిస్తుందనే టాక్ బలంగా వినిపిస్తోంది. శృతి హాసన్ సింగర్ గా మాత్రమే టాక్సిక్ కు పని చేసిందని వాదన ఇప్పుడు మొదలైయ్యింది ట్యాక్సిక్ సినిమాలో శ్రుతి హాసన్ హీరోయిన్ అని మాట బలంగా వినిపిస్తున్నది. మలయాళం నటి, ప్రముఖ దర్శకురాలు గీతూ మోహన్ దాస్ దర్శకత్వం వహిస్తున్న టాక్సిక్ కోసం కేజీఎఫ్ ఫేమ్ యష్ ఆయన జీవితంలో ఎన్నడూ లేని విధంగా నాలుగు సంవత్సరాలకు పైగా కష్టపడి పని చేశాడు.

Shruti Haasan will play the heroine in the movie Toxic starring Yash as the hero
మాజీ సీఎంకు బంఫర్ ఆఫర్ ఇచ్చిన మోదీ ? ఆంధ్రా బార్డర్ కు వెళ్లండి బ్రదర్, నో చెప్పిన లీడర్ !

యష్ అతని కొత్త సినిమా టాక్సిక్ కోసం గత రెండేళ్లుగా కథ ఎంపిక, లొకేషన్లు పరిశీలించడం, టెక్నీషియన్ల ఎంపిక, క్యారెక్టర్ ప్రిపరేషన్ ఇలా మొదలైన వాటిలో పూర్తిగా నిమగ్నమై ఉన్నాడు. ఇప్పుడు ఎట్టకేలకు టాక్సిక్ సినిమా షూటింగ్ గోవాలో మొదలైంది. బెంగళూరుకు చెందిన కేవీఎన్ ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న టాక్సిక్ చిత్రంలో యష్ తో ఇద్దరు హీరోయిన్లు స్క్రీన్ షేర్ చేసుకోనున్నారనే వార్త శ్యాండిల్ వుడ్ లో జోరుగా ప్రచారంలోకి వచ్చింది.

ఆ ఇద్దరు హీరోయిన్లు మరెవరో కాదు కరీనా కపూర్, శృతి హాసన్ అనే అభిప్రాయం కూడా వచ్చేసింది. శృతి హాసన్, కరీనా కపూర్ కపూర్ నిజంగా టాక్సిక్‌లో నటిస్తున్నారని తెలుసుకున్న యష్ అభిమానులు ఎగిరిగంత్తేస్తున్నారు. అయితే దీనికి త్వరలో కేవీఎన్ ప్రోడక్షన్ సంస్థ సమాధానం ఇస్తుందని శ్యాండిల్ వుడ్ వర్గాలు, హీరో యష్ అభిమానులు భావిస్తున్నారు. మొత్తం మీద టాక్సిక్ సినిమాకు సంబంధించిన వార్త ఎప్పటికప్పుడు ఏదో ఒకటి హాట్ టాపిక్ అవుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+