ఆ హీరోయిన్ శృంగార సీన్స్ కు కుర్రాళ్లు ఆగమాగం.. పోలీసులు కేసు నమోదు..?
సాధారణంగా ప్రేక్షకులు తమ అభిమాన హీరోలు, హీరోయిన్ లను అనుసరిస్తూ ఉంటారు. వారిలాగే డ్రెసింగ్, హెయిర్ కట్, వేశధారణతో మురిసిపోతుంటారు. అలాగే ఓ మలయాళ నటి యువతను పిచ్చెక్కిస్తోంది. ఆమె రొమాంటిక్ సీన్స్ తో కుర్రాళ్లను కట్టిపడేస్తోంది. ఆమె ఎవరో కాదు రతి నిర్వేదం హీరోయిన్ శ్వేత మీనన్. మలయాళంలో వచ్చిన ఈ అడల్ట్ సినిమా తెలుగులోనూ అదే పేరుతో డబ్ అయింది. ఈ సినిమాలో శృంగారపు సన్నివేశాలు ప్రేక్షకులను కట్టిపడేశాయి. అలాగే మలయాళంలో అడల్ట్ సినిమాల ద్వారా తనకంటూ యూత్ ఆడియన్స్ లో ఒక ప్రత్యేకమైన క్రేజ్ ని సంపాదించుకుంది శ్వేతా మీనన్. కేవలం నటిగానే కాకుండా మోడల్, టెలివిజన్ యాంకర్ గాను చేసింది. ఆమె 1994లో ఫెమినా మిస్ ఇండియా ఆసియా పసిఫిక్ టైటిల్ సైతం గెలుచుకుంది.
అలా మలయాళంలో అడల్ట్ సినిమాల ద్వారా తనకంటూ యూత్ ఆడియన్స్ లో ఒక ప్రత్యేకమైన క్రేజ్ ని సంపాదించుకుంది శ్వేతా మీనన్. ఈమె చేసే సినిమాలు యూత్ ఆడియన్స్ ఎంజాయ్ చేస్తారు.. అయితే ఈమె కారణంగా యూత్ చెడిపోతున్నారని కేరళకు చెందిన సామజిక కార్యకర్త మార్టిన్ కొచ్చి ప్రాంత పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. శ్వేతా మీనన్ అడల్ట్ సన్నివేశాలు, అభ్యంతరకరమైన డైలాగ్స్, సోషల్ మీడియా లో ఈమె వాణిజ్య ప్రకటనలపై మార్టిన్ అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఫిర్యాదు లో పేర్కొన్నాడు.

అయితే మార్టిన్ ఫిర్యాదును కొచ్చి పోలీసులు పెద్దగా పట్టించుకోలేదు. దీంతో ఆయన ఎర్నాకుళం కోర్టును ఆశ్రయించాడు. అయితే మార్టిన్ ఫిర్యాదును విచారించిన కోర్టు నటి శ్వేతా మీనన్ పై కేసు నమోదు చేయాల్సిందిగా పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. ఇక శ్వేతా మీనన్.. అనస్వరం, రతి నిర్వేదం , 100 డిగ్రీ సెల్సియస్ వంటి మలయాళం అడల్ట్ సినిమాలు చేసింది. ఇక ఆమె తెలుగు లో ఆనందం అనే ఒకే ఒక్క సినిమాలో నటించింది. ఇందులో ఆమె ఒక స్పెషల్ సాంగ్ లో కనిపించింది. మరి తాజాగా ఆమెను అరెస్ట్ చేయాలని కోర్టు ఆదేశాలు ఇవ్వడంతో శ్వేతా మీనన్ ఎలా స్పందిస్తుందో చూడాలి.












Click it and Unblock the Notifications