రాజుగారి పెళ్లి ఫిక్స్.. శ్యామలా దేవి సంచలన ప్రకటన..!
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ పెళ్లి ఎప్పుడెప్పుడా అని వేయి కళ్లతో ఎదురుచూస్తున్న ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ చెప్పారు ప్రభాస్ పెద్దమ్మ శ్యామలా దేవి. ప్రభాస్ పెళ్లిపై క్లారిటీ ఇచ్చారు. తాజాగా మీడియాతో మాట్లాడిన ఆమె.. ఈ సంవత్సరం ప్రభాస్ పెళ్లి ఖచ్చితంగా జరుగుతుందని చెప్పారు. ఆమె వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అయ్యాయి. ప్రభాస్ పెళ్లి గురించి గత పదేళ్లుగా సినీ అభిమానుల్లో, మీడియాలో చర్చ జరుగుతూనే ఉన్న క్రమంలో ఆమె వ్యాఖ్యలు ఫ్యాన్స్ లో ఫుల్ జోష్ ను నింపాయి.
ప్రభాస్ పెళ్లి పై పెద్దమ్మ శ్యామలాదేవి కీలక వ్యాఖ్యలు చేశారు..
— RTV (@RTVnewsnetwork) August 11, 2025
ప్రభాస్ కు తప్పకుండా పెళ్లి అవ్వాలని స్వామి వారిని మనస్ఫూర్తిగా కోరుకున్నాను...
కుటుంబ సభ్యులా? కాదా అన్నది తెలీదు కాని ప్రభాస్ కు పెళ్లి మాత్రం జరుగుతుంది..#Prabhas #Peddamma #ShyamalaDevi #Comments #Marriage… pic.twitter.com/gHjWNUOmLU
బాహుబలి చిత్రంతో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్.. పాన్ ఇండియన్ స్టార్ గా మారిపోయారు. ఆ తర్వాత హిట్స్ , ప్లాఫ్స్ తో సంబంధం లేకుండా వరుసబెట్టి మూవీస్ చేస్తున్నారు. డార్లింగ్ చేస్తున్న మూవీస్ అన్నీ పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్నాయి. అయితే ప్రభాస్ పెళ్లి గురించి తెలుగు రాష్ట్రాల ఫ్యాన్స్ తో పాటు యావత్ ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో దివంగత స్టార్ హీరో కృష్ణంరాజు సతీమణి, ప్రభాస్ పెద్దమ్మ శ్యామలా దేవీ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రభాస్ పెళ్లి ఈ ఏడాది చేయాలని అనుకుంటున్నట్లు హింట్ ఇచ్చారు. ఆ దేవుడి ఆశీస్సులతో త్వరలోనే గుడ్ న్యూస్ వస్తుందని అన్నారు. ఆమె వ్యాఖ్యాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

"మీరంతా ప్రభాస్ పెళ్లి గురించే అడుగుతుంటారు. తప్పకుండా బాబు పెళ్లి జరుగుతుంది. మనస్ఫూర్తిగా చేయాలని మాకూ ఉంది. కానీ శివుడి ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదని అంటారు. శివుడు అనుగ్రహిస్తే ఆయన ఏ రోజు అనుకుంటే ఆ రోజు పెళ్లి జరుగుతుంది. అని శ్యామలాదేవి చెప్పుకొచ్చారు. ఇక ప్రభాస్ ప్రస్తుతం రాజాసాబ్ మూవీ షూటింగ్ లో బిజీగా ఉన్నారు. ఈ మూవీ ఈ ఏడాది డిసెంబర్ 5 న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. అలాగే హను రాఘవపూడితో ఫౌజీ, సందీప్ రెడ్డి వంగాతో స్పిరిట్ మూవీ చేస్తున్నారు ప్రభాస్. ఇక ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో సలార్ 2 చేయాల్సి ఉంది. అంతేకాక నాగ్ అశ్విన్ డైరెక్షన్ లో కల్కి 2 మూవీ కూడా చేస్తున్నారు ప్రభాస్.












Click it and Unblock the Notifications