సిద్ధు జొన్నలగడ్డ, వైష్ణవి 'జాక్' ట్రైలర్ రిలీజ్.. మళ్లీ ముద్దులు, బూతులు రిపీట్
స్టార్ బాయ్ సిద్దు జొన్నలగడ్డ, యంగ్ బ్యూటీ వైష్ణవి చైతన్య కలిసి నటించిన చిత్రం 'జాక్'. మోస్ట్ ఎలిజబుల్ బ్యాచ్‌లర్ తరువాత చాలా గ్యాప్ తీసుకొని బొమ్మరిల్లు భాస్కర్ ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. ఎస్వీసీసీ బ్యానర్ మీద బీవీఎస్ఎన్ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించారు. టిల్లు, టిల్లు స్క్వేర్ తరువాత వస్తున్న సినిమా కావడంతో ఈ మూవీపై భారీ అంచనాలు నెలకున్నాయి. ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన సాంగ్స్, టీజర్ సినిమాపై అంచనాలను పెంచాయి. ఏప్రిల్ 10న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుండగా.. ఇప్పుడు లేటెస్ట్ గా ట్రైలర్ రిలీజ్ చేసి అభిమానులకు స్వీట్ సర్ ప్రైజ్ ఇచ్చింది.
ట్రైలర్ ఎలా ఉందంటే..?
డ్రగ్స్ నేపథ్యంలో లవ్, కామెడీ, యాక్షన్ అన్ని మిక్స్ చేసి రూపొందిస్తున్నట్టు కనబడుతోంది. గత చిత్రాలకు భిన్నంగా ఈ సినిమాలో సిద్దు జొన్నలగడ్డ సరికొత్త యాంగిల్ లో కనిపించారు. సిద్ధూ జొన్నలగడ్డ మార్క్ కామెడీ టైమింగ్, డైలాగ్ డెలివరీ ఈ ట్రైలర్ లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. టెర్రరిస్ట్ ముఠాలను పట్టుకునే సీక్రెట్ ఏజెంట్ తరహాలో కనిపిస్తున్నట్టు తెలుస్తోంది. అలానే సిద్దు, వైష్ణవి చైతన్య రొమాంటిక్ సన్నివేశాలు కూడా యూత్ ను బాగా ఆకట్టుకుంటాయని అర్ధం అవుతోంది. ఇక అలానే ఈ ట్రైలర్‌లో కూడా సిద్దు బూతులతో రెచ్చిపోయాడు. సినిమాలో ఆ బూతులకు బీప్ లు తప్పవని అనుకుంటున్నారు.

ప్రకాష్ రాజ్ టెర్రరిస్టుల గ్యాంగ్ ని పట్టుకునేందుకు ఒక ఆపరేషన్ మొదలు పెడుతాడు, ఆ ఆపరేషన్ లో హీరో కూడా ఉంటాడు. హీరో కి ఈ ఆపరేషన్ కి అసలు ఏమిటి సంబంధం? ఇక వైష్ణవి చైతన్య పాత్రకి చాలా ప్రాధాన్యత ఉందన్నట్టుగా కనిపిస్తోంది. అంతే కాకుండా ప్రకాష్ రాజ్, సిద్దు మధ్య సన్నివేశాలు కూడా ఆసక్తికరంగా ఉన్నాయి. వీటికి తోడు వీకే నరేష్ కామెడీ, శ్యామ్ సీఎస్ ఆర్ఆర్, అచ్చు రాజమణి పాటలు సినిమాకు ప్లస్ అవుతాయని అంచనా వేస్తున్నారు.
ఇన్నాళ్లు లవ్ స్టోరీల మీదే ఫోకస్ పెట్టినా బొమ్మరిల్లు భాస్కర్.. ఈసారి ట్రాక్ మార్చి యాక్షన్ సీక్వెన్స్‌లను కూడా తెరకెక్కించడం అంచనాలను డబుల్ చేస్తోంది. ఈ మూవీతో సిద్ధు హ్యాట్రిక్ కొనసాగిస్తారా ? బొమ్మరిల్లు భాస్కర్ సక్సెస్ దక్కించుకుంటారా అనేది తెలియాలంటే కొన్ని రోజులు ఆగక తప్పదు..
-
'రాత్రి 9 దాటితే నాకు ఆ కోరిక తప్పదు!' -
నా బ్యూటీ సీక్రెట్ రహస్యం అదే.. అసలు విషయం బయటపెట్టిన తెలుగు హీరోయిన్ -
సినిమాలకు గుడ్‌బై చెప్పనున్న "త్రిష".."విజయ్" బాటలోనే పాలిటిక్స్ లోకి !! -
క్షమించండి.. మళ్లీ నోరు జారను !! -
ఏడడుగులు వేయబోతున్న స్టార్ బ్యూటీ అనుష్క శెట్టి.. పెళ్లి కొడుకు ఫిక్స్ ?? -
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
ప్రేమ్ రక్షిత్ మాస్టర్‌కు "మైఖేల్ జాక్సన్" కొరియోగ్రాఫర్ ప్రశంసలు.. -
రాజేంద్ర ప్రసాద్‌కి హీరో విశాల్ వార్నింగ్.. క్షమాపణ చెప్పాల్సిందే !! -
హైదరాబాద్ లో హాలీవుడ్.. నెట్‌ఫ్లిక్స్ ఐలైన్ స్టూడియో ప్రారంభించి సీఎం రేవంత్ వ్యాఖ్యలు! -
తెలుగు సినీ ఇండస్ట్రీలో ‘ముగ్గురు మొనగాళ్లు’ ఎవరో తెలుసా? -
లారీ ఎక్కి వెళ్లి కృష్ణ సినిమాలు చూసేవాడిని: సీఎం రేవంత్ -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ










Click it and Unblock the Notifications