అవన్నీ నిజం కాదంటున్న సింగర్ కల్పన.. సెల్ఫీ వీడియో రిలీజ్
ప్రముఖ సింగర్ కల్పన వ్యవహారం హాట్ టాపిక్ గా మారుతోంది. రీసెంట్ గానే ఆమె నిద్ర మాత్రలు మింగి అపస్మారక స్థితిలోకి వెళ్లడంతో ఆసుపత్రి పాలైన విషయం తెలిసిందే. నిద్ర పట్టడం కోసం తీసుకున్న మెడిసిన్ ఓవర్ డోస్ కారణంగా అపస్మారక స్థితికి వెళ్ళిందని వైద్యులు సైతం స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే తాజాగా సెల్ఫీ వీడియో రిలీజ్ చేసింది కల్పన. తన భర్తతో తనకు ఎలాంటి విభేదాలు లేవని.. మీడియాలో తమ కుటుంబంపై తప్పుడు ప్రచారం సాగుతోందని క్లారిటీ ఇచ్చింది.
అలా ఆ వీడియోలో కల్పన మాట్లాడుతూ.. తమ కుటుంబంలో ఎలాంటి గొడవలు లేవు అని వెల్లడించింది. తన భర్త, కూతురుతో సంతోషంగా జీవిస్తున్నానని.. 45 ఏళ్ల వయసులో పీహెచ్‌డీ, ఎల్‌ఎల్‌బీ చేస్తున్నానని చెప్పుకొచ్చారు. తన భర్త ఎంకరేజ్ చేయడం వల్లనే ఇవన్నీ చేయగలుగుతున్నా అంటూ స్పష్టం చేసింది. అన్ని విషయాల్లోనూ ఆయన తనను అర్థం చేసుకుని అండగా నిలుస్తున్నాడని కల్పన తెలిపింది. అంతే కాకుండా మ్యూజికల్ కాన్సర్ట్స్ లో పాల్గొంటున్నానని.. ఆ స్ట్రెస్ వల్లే నిద్ర పట్టట్లేదని వివరించింది.

అందుకోసం చికిత్స తీసుకుంటున్నానని, వైద్యులు సూచించిన ప్రిస్క్రిప్షన్ లోని టాబ్లెట్లను అధిక మోతాదులో తీసుకున్నానని తెలిపారు. అందువల్లే స్పృహ తప్పి పడిపోయినట్లు చెప్పారు. తన భర్త ప్రసాద్ ప్రభాకర్ సరైన సమయంలో పోలీసులకి సమాచారం ఇచ్చి కాపాడారని వెల్లడించింది. త్వరలనే మళ్లీ పాటలు పడుతూ మీ ముందు వస్తాను.. మీడియాకి పోలీసులకి ప్రత్యేక ధన్యవాదాలు అని అన్నారు. తన ఆరోగ్యం గురించి చాలామంది ఆరా తీస్తున్నారని.. వారందరికీ ధన్యవాదాలని వీడియోలో పేర్కొన్నారు.
ప్రస్తుతం కల్పన ఆసుపత్రిలో కోలుకుంటున్నారు. గత ఏది ఏళ్లుగా ఆమె భర్తతో కలిసి హైదరాబాద్ లోని నిజాంపేట్ లో ఓ విల్లాలో నివాసం ఉంటోంది. నాలుగు రోజుల క్రితం చెన్నైలోని ఎర్నాకుళం నుంచి హైదరాబాద్ ఇంటికి వచ్చిన కల్పన నిద్ర పట్టకపోవడంతో నిద్రమాత్రలు వేసుకుంది. అయినా నిద్ర రాకపోవడంతో మరో 10 నిద్రమాత్రలు వేసుకోవడంతో అపస్మారక స్థితికి వెళ్ళినట్టు సమాచారం.
-
Tamil nadu Survey: తమిళనాట సీన్ రివర్స్-మ్యాట్రిజ్ సర్వేలో షాకింగ్ రిజల్ట్స్..! -
మహేశ్‌కు శ్రీలీల స్వీట్ వార్నింగ్! -
ఉగాది ఎప్పుడు చేసుకోవాలి 19 లేక 20 తేదీనా - వరుస సెలవులపై తాజా నిర్ణయం..!! -
ఏపీ మీదుగా బెంగళూరు, చెన్నై ప్రత్యేక రైళ్లు.. ఇకపై: హాల్ట్ స్టేషన్లు -
విజయ్- త్రిష పెళ్లికి త్రిష తల్లి గ్రీన్ సిగ్నల్..? -
West Bengal Survey: బెంగాల్లో అనూహ్య ఫలితాలు?-తేల్చేసిన మ్యాట్రిజ్ సర్వే..! -
LPG కొరతకు చెక్.. భారత్ మార్కెట్ లోకి DME Fuel !! -
ఏప్రిల్ నెలలో మేషరాశి, వృషభ రాశి జాతక ఫలం -
వైసీపీలోకి సీనియర్ నేత రీ ఎంట్రీ, అదే బాటలో..!! -
కుప్పకూలుతున్న పసిడి ధరలు- భారీగా క్రాష్ -
అందుకే.. విజయ్ జన నాయగన్ డిలే అయింది: పవన్ కల్యాణ్ -
మాస్కోలోని పుతిన్ నివాసంలో తలదాచుకున్న ఇరాన్ సుప్రీం లీడర్..??












Click it and Unblock the Notifications