Singer Mangli: మంగ్లీ పెళ్లి, కొత్త ట్విస్ట్ - వరుడి పై క్లారిటీ ఇచ్చేసిన సింగర్..!!
సింగర్ మంగ్లీ(Singer Mangli) పెళ్లి వార్తలు కొద్ది రోజులుగా వైరల్ అవుతున్నాయి. ప్లే బ్యాక్ సింగర్‌గా టాలీవుడ్‌లోనూ తన దైన ముద్ర వేసుకున్న ఈ ట్యాలెంటెడ్ సింగర్ మంగ్లీ త్వరలోనే తన బావతో పెళ్లి పీటలు ఎక్కనుందనే వార్త ప్రచారంలోకి వచ్చింది. ఇందుకోసం ఇప్పటికే అంగీకరించిన ప్రాజెక్టులను పూర్తి చేసే పనిలో మంగ్లీ ఉందని ప్రచారం జరుగుతోంది. తాజాగా తన పెళ్లి రూమర్లపై స్పందించిన మంగ్లీ అసలు విషయం ఏంటో బయట పెట్టింది.
మంగ్లీ పాటలకు ఎంతో మంది ఫ్యాన్స్ ఉన్నారు. మంగ్లీ ఆలపించే బతుకమ్మ, బోనాల పాటలతో పాటుగా ఫోక్, డివోషనల్, సినిమా సాంగ్స్ కు మంచి ఆదరణ ఉంది. మంగ్లీ ప్రస్తుతం ఇండస్ట్రీలో బిజియెస్ట్ సింగర్ గా మారిపోయింది. ఒక మామూలు పల్లెటూరు నుండి వచ్చిన అమ్మాయి స్టార్ సింగర్ రేంజ్ కు తక్కువ కాలంలోనే చేరింది. శైలజా రెడ్డి అల్లుడు, నీది నాకే ఒక కేథ, జార్జ్ రెడ్డి, అలా వైకుంఠ పురం, సిటీమార్, లవ్ స్టోరీ, రంగ్ దే, అల్లుడు అదుర్స్, క్రాక్, పెళ్లి సందడి, పుష్ప (కన్నడ), రౌడీ బాయ్స్, ధమకా, బలగం, భోళాశంకర్ తదితర సినిమాల్లో మంగ్లీ ఆలపించిన పాటలు పాపులర్ అయ్యాయి. ఇక, మంగ్లీ వివాహం చేసుకోనుందనే వార్త వైరల్ అవుతోంది.

సింగర్ మంగ్లీ త్వరలోనే పెళ్లి చేసుకోనుందని, తన బావతో కలసి ఏడడుగులు నడవనుందని పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఇందుకోసం ఇప్పటికే అంగీకరించిన ప్రాజెక్టులను పూర్తి చేసే పనిలో మంగ్లీ ఉందని ప్రచారం జరుగుతోంది. తాజాగా తన పెళ్లి రూమర్లపై స్పందించిన మంగ్లీ ఘొల్లున నవ్వేసింది. అసలు ఇప్పట్లో తనకు పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదని తేల్చేసారు. అలాగే వరుసకు బావ అయ్యే వ్యక్తిని పెళ్లి చేసుకుంటాను అని అంటున్నారని.. తనకు తెలియని బావ ఎక్కడినుండి వచ్చాడో అర్థం అవ్వడం లేదని చెప్పుకొచ్చారు. తనకు కూడా తెలియకుండానే నా పెళ్లి చేస్తున్నారు అంటూ సెటైర్ వేసింది.ఇక మంగ్లీ (Mangli) క్లారిటీ ఇవ్వడంతో ఆమె పెళ్లి వార్తలకు పులిస్టాప్ పడినట్లు కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications