సింగర్ సునీత కాపురంలో ఆ యూట్యూబర్ చిచ్చు..?
సింగర్ సునీతకు తెలుగు ఇండస్ట్రీలో ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోని అందం సునీత సొంతం. సింగర్‌గానే కాకుండా డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా కూడా సునీతకు మంచి గుర్తింపు ఉంది. ఇక సునీత వ్యక్తిగత జీవితానికి వస్తే..వేధింపులకు గురి చేస్తున్నారనే కారణంతో తన మొదటి భర్తకు సునీత విడాకులిచ్చారు. తన మొదటి భర్తతో ఆమె ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చారు. మొదటి భర్తతో విడిపోయిన తరువాత సునీత కొంతకాలం సింగిల్‌గానే జీవించారు.
పిల్లలు రెండో పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేయడంతో ప్రముఖ వ్యాపారవేత్త అయిన రామ్ వీరపనేనిను సునీత రెండో వివాహం చేసుకున్నారు. రెండో పెళ్లిపై సునీత చాలానే విమర్శలను ఎదుర్కోవాల్సి వచ్చింది. కోట్లాది రూపాయిలు ఉండటంతోనే సునీత రామ్ వీరపనేనిని రెండో వివాహం చేసుకున్నారని చెప్పి ఆమెను దారుణంగా విమర్శించారు.అయితే ఈ విమర్శలపై సునీత ఎమోషనల్‌గా అవుతూ రియాక్ట్ అవుతూ.. ఒకర్ని ఒకరు అర్థం చేసుకున్న తర్వాతే రామ్ వీరపనేనితో పెళ్లికి అంగీకరించానని, అంతేకాని ఆస్తి కోసం కాదని సునీత క్లారిటీ ఇచ్చారు.

ఇదిలా ఉంటే తాజాగా సునీతకు సంబంధించిన ఓ వార్త నెట్టింట చక్కర్లు కొడుతుంది. భర్త రామ్ వీరపనేని, సునీతల మధ్య విభేదాలు చోటు చేసుకున్నాయానే వార్త ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఓ యూట్యూబర్‌తో సునీత దిగిన ఫొటోలు, వీడియోల కారణంగానే వీరి మధ్య గొడవలు జరిగినట్టు తెలుస్తోంది. ఆ యూట్యూబర్‌తో కొన్ని ఫొటోలు, వీడియోలు బయటకు రావడంతో వీటిని చూసిన ఆమె రెండో భర్త రామ్ వీరపనేని ఈ ఫొటోలు ఏంటని సీరియస్ అయినట్టు సమాచారం. ఈ విషయంలో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగిందనే ప్రచారం జరుగుతోంది. మరి ఈ గొడవలు నిజంగానే జరిగాయా లేదా సోషల్ మీడియాలో వస్తున్న రూమర్స్ అనేది తెలియలేదు కానీ సోషల్ మీడియాలో ఈ వార్త ట్రెండింగ్‌లో ఉంది. మరోవైపు ఆమె సన్నిహితులు మాత్రం ఇవన్నీ ఒట్టి పుకార్లు అని కొట్టిపారేస్తున్నారు.












Click it and Unblock the Notifications