హారర్ మూవీతో కోలీవుడ్‌లో ఎంట్రీ ఇవ్వనున్న సీతారామం బ్యూటీ...
సీతారామం సినిమాతో తెలుగులో మంచి గుర్తింపు తెచ్చుకుంది నటి మృణాల్ ఠాకూర్. ఈ సినిమాలోని సీత పాత్రలో మృణాల్ ఒదిగిపోయారనే చెప్పుకోవాలి. ఆ పాత్ర ఆమెకు ఎంతో పేరుతెచ్చిపెట్టింది. ఇప్పటికే మృణాల్ బయటికొచ్చిన ఆమెను సీత అనే పిలుస్తున్నారు ఆమె అభిమానులు. ఇక, నటుడు నానితో కలిసి నటించిన హాయ్ నాన్న చిత్రం కూడా మంచి విజయాన్ని అందుకుంది. అందులోని తల్లి పాత్రలో కూడా మృణాల్ ఎంతో చక్కగా కనిపించారు. తాజాగా, ఈ బ్యూటీకి సంబంధించిన ఓ న్యూస్ నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఈ అమ్మడు త్వరలోనే కోలీవుడ్‌లో ఎంట్రీ ఇవ్వనున్నారు. అది కూడా ఓ హారర్ మూవీ అని తెలుస్తోంది.
నటుడు, డ్యాన్సర్ రాఘవ లారెన్స్ హీరోగా నటిస్తోన్న కాంచన 4లో మృణాల్ ఠాకూర్‌ను తీసుకున్నట్లు న్యూస్ వస్తున్నాయి. కాంచన సిరీస్ ఇప్పటికీ పెద్ద పెద్ద విజయాల్నీ సాధించిన సంగతి తెలిసిందే. ఒక్క తమిళంలోనే కాకుండా తెలుగులో కూడా ఈ సిరీస్ మంచి వసూళ్లను రాబట్టాయి. ముని సినిమాతో ప్రారంభమైన ఈ సిరీస్ కాంచన-2, కాంచన 3 భారీ విజయాలను అందుకున్నాయి. ఇవి కేవలం తెలుగులోనే కాకుండా హిందీ, కన్నడంతో పాటు పలు భాషల్లో రీమేకయ్యి భారీ వసూల్లు కురిపించాయి. ఇక, త్వరలోనే కాంచన 4 కూడా రాబోతున్నట్లు తెలుస్తోంది. కాంచన 4లో హీరోగా చేస్తూనే ఈ సినిమాకు లారెన్స్ దర్శకత్వం వహించబోతున్నాడు.

ప్రస్తుతం కాంచన 4కు సంబంధించి స్క్రిప్ట్ రెడీ అవుతు్నట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ కూడా ప్రారంభం కానుందట. అయితే, ఈ సినిమాలో మృణాల్ ఠాకూర్‌ను హీరోయిన్‌గా తీసుకున్నట్లు కోలివుడ్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ చిత్రంతోనే ఆ బ్యూటీ కోలివుడ్‌లో అడుగుపెట్టబోతున్నారని టాక్. ఈ సినిమాలో హీరోయిన్‌కున్న ఇంపార్టెన్స్‌ను బట్టి తనకు కథ నచ్చడంతో మృణాల్ ఒకే చెప్పినట్లు తెలుస్తోంది. అయితే, ఈవిషయంపై అటు చిత్ర యూనిట్ గానీ మృణాల్ కానీ అధికారికంగా ఎటువంటి ప్రకటనా చేయలేదు. అయితే, ఈ వార్తలో నిజమెంతో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే..!












Click it and Unblock the Notifications