షాకింగ్ వీడియో: స్టార్ హీరో కారుకు ప్రమాదం..
తమిళ స్టార్ హీరో శివకార్తికేయన్ ప్రయాణిస్తున్న కారు చెన్నైలో ప్రమాదానికి గురైంది. సెంట్రల్ కైలాష్ ప్రాంతంలో ఆయన ప్రయాణిస్తున్న కారును ఎదురుగా వస్తున్న మరో కారు ఢీ కొట్టింది. అయితే కారులో ఉన్న శివకార్తికేయన్ కు ఎలాంటి గాయాలు కాలేదని సమాచారం. ఈ ఘటన గురించి తెలుసుకున్న ట్రాఫిక్ పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని విచారణ చేపట్టారు.
ప్రముఖ నటుడు శివకార్తికేయన్ కారు చెన్నైలో రోడ్డు ప్రమాదానికి గురైంది. ఆయన ప్రయాణిస్తున్న కారును ఎదురుగా వస్తున్న మరో కారు ఢీకొట్టింది. అయితే ఈ ప్రమాదంలో ఆయన కారు కాస్త దెబ్బతిన్నట్లు తెలుస్తోంది. ప్రమాద సమయంలో హీరో శివకార్తికేయన్ తో పాటుగా అతని కుటుంబ సభ్యులు కారులో ఉన్నట్లు సమాచారం. అయితే ఈ ప్రమాదంలో ఎవరీకి ఎలాంటి గాయాలు కాలేదని సమాచారం. ఘటన జరిగిన వెంటనే ట్రాఫిక్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు.
Actor #ShivaKarthikeyan narrowly escapes danger as another car hits his vehicle from behind in Kailash, Chennai. Thankfully, he walked away safe.
— FilmyBowl Tamil (@FilmyBowlTamil) December 20, 2025
Follow 👉 @FilmyBowlTamilpic.twitter.com/K6yaUm1BhG
రెమో, వరుణ్ డాక్టర్, కాలేజ్ డాన్, అమరన్, ప్రిన్స్, సినిమాలతో తెలుగు ప్రేక్షకులను అలరించిన తమిళ హీరో శివ కార్తికేయన్. గతేడాది అమరన్ చిత్రంతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. అశోకచక్ర బిరుదు గ్రహీత మేజర్ ముకుంద్ వరదరాజన్ జీవిత చరిత్రతో తెరకెక్కిందీ చిత్రం. దేశభక్తిని, త్యాగాన్ని, ధైర్యాన్ని దేశవ్యాప్తంగా ప్రేక్షకులకు చూపించిన చిత్రం ఇది. ఇందులో ముకుంద్ వరదరాజన్ పాత్రలో శివకార్తికేయన్ అద్భుతంగా నటించాడు. ఈ మూవీలో సాయి పల్లవి ఆర్మీ ఆఫీసర్ భార్యగా నటించింది.

శివకార్తికేయన్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం పరాశక్తి.. ఈ చిత్రం 2026 జనవరి 14న విడుదలకు సిద్ధమవుతోంది. ఇది శివకార్తికేయన్ కు 25వ చిత్రం. ఈ చిత్రానికి సుధాకొంగర కథ, దర్శకత్వం బాద్యతలను నిర్వహిస్తున్నారు.
-
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..! -
జగన్, షర్మిల సహా వారికి చంద్రబాబు లేఖ - కీలక విజ్ఞప్తి..!!












Click it and Unblock the Notifications