అభిమానులకు అక్కినేని కోడలు గుడ్ న్యూస్ ..ఇక పండగే..!
తెలుగు అమ్మాయిలు హీరోయిన్‌గా ఆఫర్లు దక్కించుకోవడం కష్టం అనుకుంటున్న సమయంలో బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్‌లోనూ సినిమాలు చేసి నటిగా తనను తాను నిరూపించుకున్న ముద్దుగుమ్మ శోభిత ధూళిపాళ. మోడల్‌గా కెరీర్ ప్రారంభించిన శోభితా రాణా,కోల్గేట్, రిలయన్స్ ట్రెండ్స్, గోద్రెజ్ వంటి బ్రాండ్‌లకు మోడల్‌గా వ్యవహరించింది. ఇండియాస్ బెస్ట్ సినీస్టార్స్ కి ఖోజ్ అనే రియాల్టీ షోలో వైల్డ్ కార్డ్ పెర్ఫార్మర్‌గా కూడా పాల్గొంది. 2013లో మిస్ ఇండియా పోటీల్లో పాల్గొని మిస్ ఇండియా ఎర్త్ 2013 టైటిల్‌ను గెలుచుకుంది.
ఆ తర్వాత సినిమాల్లో నటిస్తూ ఫుల్ బిజీగా మారింది. రామన్ రాఘవ్ 2.0 (సైకో రామన్)తో తన అరంగేట్రం చేసింది. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో నటిస్తూ తనకంటే ప్రత్యేక గుర్తింపు దక్కించుకుంది. ఇదే సమయంలో హీరో నాగ చైతన్యతో ప్రేమయాణం సాగించి మరింత వార్తల్లో నిలిచింది. ముఖ్యంగా నాగ చైతన్య వల్లే శోభిత ధూళిపాళ లైఫ్ లైన్‌లోకి వచ్చింది.సమంతతో విడాకుల తీసుకున్న తర్వాత తెలుగు హీరోయిన్ శోభిత ధూళిపాళతో రిలేషన్‌లో మెయిన్‌టైన్ చేశాడు. ఈక్రమంలోనే డిసెంబర్ 4వ తేదీన వీరి వివాహం జరిగింది. అతి కొద్దిమంది సమక్షంలోనే వీరి వివాహం జరిగింది.

పెళ్లి తర్వాత తన సినిమాలతో బిజీ అయిపోయింది శోభిత.పెళ్లి అనంతరం అటు నాగ చైతన్య తిరిగి తన సినిమాలతో బిజీగా అయిపోయాడు. తండేల్ సినిమాతో సూపర్ హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు చైతన్య. ఆ జోష్‌లోనే ఈ జంట తమ హానీమూన్ పీరియడ్‌ను సైతం పూర్తి చేసుకున్నారు. నాగ చైతన్య ప్రస్తుతం తన 25వ సినిమాలో నటిస్తున్నాడు. ఇక పెళ్లి తర్వాత శోభిత కొన్నాళ్లు సినిమాకు దూరంగా ఉంది. అయితే గత కొంతకాలంగా సోషల్ మీడియాకు దూరంగా ఉన్న శోభిత తాజాగా అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పింది.
శోభిత తాజాగా తన రీఎంట్రీ గురించి హింట్ ఇచ్చింది. ఇన్‌స్టాగ్రామ్‌లో డబ్బింగ్ చెబుతున్న ఫొటోలను షేర్ చేస్తూ, "కుకింగ్" అనే క్యాప్షన్ పెట్టింది. అయితే, ఏ సినిమా గురించో మాత్రం వెల్లడించలేదు. శోభిత రీఎంట్రీ పోస్ట్‌పై నెటిజన్ల నుంచి భిన్న స్పందనలు వ్యక్తమవుతున్నాయి. కొందరు నెటిజన్లు ఆమె ప్రెగ్నెన్సీ గురించి ప్రకటిస్తుందనుకున్నారని, కానీ రీఎంట్రీ పోస్ట్‌తో ఆశ్చర్యపరిచిందని కామెంట్స్ చేశారు. మరికొందరు మాత్రం సినిమాలు అవసరమా? పిల్లలను కని ఇంటి బాధ్యతలు చూసుకో అంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. అయితే, అక్కినేని అభిమానులు మాత్రం శోభితకు మద్దతుగా నిలిచారు. పెళ్లైతే సినిమాలు చేయకూడదని ఏమైనా రూల్ ఉందా? అని ప్రశ్నిస్తూ ఆమె నిర్ణయాన్ని సమర్థించారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.
-
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
విజయ్ ప్రభంజనం. 32 శాతం ఓట్లతో దూసుకుపోతున్న దళపతి! -
సీరియల్లో అలా.. సోషల్ మీడియాలో ఇలా.. బ్యూటీ పిక్స్ వైరల్ !! -
స్టేడియం ఖాళీ.. కుర్చీలు ఫుల్! పీఎస్ఎల్ అంటే ఇదేనా నాయనా? -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..! -
ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్: రిటైర్మెంట్ వయస్సు పెంపు -
ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు పడే ఛాన్స్ -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
రైతుభరోసా నిధుల విడుదల.. సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర ట్వీట్! -
ఆరేళ్ల క్రితం ఇదే రోజు.. గుర్తుందా ఆ 'జనతా కర్ఫ్యూ'?












Click it and Unblock the Notifications