సమంతకు దిమ్మతిరిగే కౌంటరిచ్చిన శోభిత ధూళిపాళ్ల..?
సమంత , నాగ చైతన్యల జంట ఇండస్ట్రీలో బెస్ట్ పెయిర్‌గా నిలుస్తుందని అందరూ భావించారు. కొన్నాళ్లు బాగానే సాగిన వీరి కాపురంలో అభిప్రాయభేదాలు తలెత్తడంతో ఈ జంట విడాకులు తీసుకున్నారు. అయితే విడాకుల విషయంలో అభిమానులు రెండు వర్గాలుగా విడిపోయి.. సమంతది తప్పంటే.. లేదు నాగచైతన్యదే తప్పని సోషల్ మీడియా వేదికగా యుద్దం చేశారు.
విడాకులపై నాగచైతన్య ఎప్పుడు మాట్లాడింది లేదు. కాని సమంత మాత్రం తన సినిమాల విడుదల సమయంలో పరొక్షంగా విడాకులపై స్పందిస్తూ వస్తున్నారు. అయితే వారిద్దరు తిరిగి కలిస్తే చాలా బాగుంటుందని అభిమానులు కోరుకుంటున్నారు.అయితే వీరిద్దరు ఎందుకు విడాకులు తీసుకున్నారో అనే దానిపై ఇప్పటి వరకూ ఎటువంటి స్పష్టత లేదు.సమంత ప్రస్తుతం ఒంటరికి ఉంటున్నారు.

అటు నాగ చైతన్య కూడా సింగిల్‌గానే ఉంటున్నారు. సమంత గత కొంతకాలంగా మయసైటీస్ అనే వ్యాధితో బాధపడుతున్నారు. అనారోగ్య కారణంగా సమంత పెద్దగా సినిమాలు చేయడం లేదు. అటు నాగ చైతన్య మాత్రం వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నాడు.అయితే సమంతతో విడాకుల తీసుకున్న తరువాత తెలుగు హీరోయిన్ శోభిత ధూళిపాళతో రిలేషన్‌లో ఉన్నాడనే పుకార్లు షికార్లు చేశాయి..తాజాగా నాగ చైతన్య సమ్మర్ వెకేషన్‌కు వెళ్లిన ఫొటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఆ ఫొటోను శోభిత ధూళిపాళ లైక్ చేయడం ఇప్పుడు టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారిపోయింది.
ఈ ఘటన తరువాత , చైతన్య, శోభితలకు సమంత కౌంటర్ ఇవ్వడం..దానికి శోభిత తిరిగి కౌంటర్ ఇవ్వడం వంటివి చక చక జరిగిపోయాయి. చైతూ,శోభిత రిలేషన్ గురించి వార్తలు వచ్చిన వెంటనే..సమంత తన వెడ్డింగ్ డ్రెస్ రీ క్రియేట్ చేయించి వారికి కౌంటరిచ్చిందనే ప్రచారం జరుగుతోంది.దీనికి శోభిత సైతం సమంతకు అదిరిపోయే కౌంటరిచ్చిందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.నేను ప్రతి ఒక్కరి కప్ ఆఫ్ చాయి కాదు అంటూ సామ్‌కు శోభితా అదిరిపోయే విధంగా కౌంటర్ ఇచ్చిందంటూ నెట్టింట పెద్ద చర్చే జరుగుతోంది.












Click it and Unblock the Notifications