పెళ్లిలో శోభిత ధూళిపాళ మాస్ డ్యాన్స్
హీరో నాగ చైతన్యతో శోభిత ధూళిపాళ ప్రేమయాణం గురించి తెలిసిందే. ముఖ్యంగా నాగ చైతన్య వల్లే శోభితా ధూళిపాళ లైఫ్ లైన్‌లోకి వచ్చింది.సమంతతో విడాకుల తీసుకున్న తర్వాత తెలుగు హీరోయిన్ శోభిత ధూళిపాళతో రిలేషన్‌లో మెయిన్‌టైన్ చేశారు. నాగ చైతన్య , శోభిత ధూళిపాళ సైలెంట్‌గా నిశ్చితార్థం చేసుకున్నారు. ఈక్రమంలోనే నాగ చైతన్య , శోభిత ధూళిపాళ డిసెంబర్ 4న అన్నపూర్ణ స్టూడియోలో చాలా సింపుల్‌గా వివాహం చేసుకున్నారు.
పెళ్లిలో మాస్ డాన్స్ తో దుమ్మురేపిన శోభిత ధూళిపాళ్ల#SobhitaDhulipala #NagaChaitanya #SoChay #Oneindiatelugu pic.twitter.com/Oo6PHEtVYW
— oneindiatelugu (@oneindiatelugu) December 11, 2024
పెళ్లి విషయంలో శోభిత ధూళిపాళ చాలా ప్లాన్డ్‌గా ముందుకు వెళ్లినట్టు కనిపించింది. ఎటువంటి హంగు ఆర్భాటాలకు వెళ్లకుండా సైలెంట్‌గా వివాహం చేసుకుంది. పెళ్లికి సంబంధించిన దుస్తులు విషయంలో కూడా ఆమె సాదాసీదాగానే ఎంపిక చేసుకున్నట్టు కనిపించారు. అక్కినేని ఇంటి కోడలు కాబోతున్నప్పటికీ శోభిత సింపుల్‌గా చెల్లెలతో కలిసి సింపుల్‌గా షాప్‌కు వెళ్లి మరీ పెళ్లి చీరను కొనుగొలు చేయడం జరిగింది. ఇక పెళ్లిలో కూడా ఆమె సాధారణ మహిళగానే కనిపించి అందరికి షాకిచ్చారు.

పెళ్లి రోజున శోభిత ధూళిపాళ చేసిన అల్లరికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు ఒకొక్కటిగా బయటకు వస్తున్నాయి. తాజాగా శోభిత పెళ్లి రోజు మెకప్ గదిలో అందంగా రెడీ అవుతున్న వీడియో ఒకటి వైరల్ అవుతోంది. శోభిత ధూళిపాళ 'శ్రద్ధా నా పెళ్లవుతోంది. నాకు సిగ్గేస్తోంది' అంటూ అల్లు అర్జున్ నటించిన 'సరైనోడు' సినిమాలోని బ్లాక్ బస్టర్ అనే పాటకు మాస్ స్టెప్పులు వేసి మరీ అక్కడున్న వారికి షాకిచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.












Click it and Unblock the Notifications