నాగ చైతన్యతో ఉన్న ప్రైవేట్ ఫొటోలు లీక్ చేసిన శోభిత ధూళిపాళ
ఇటీవల సోషల్ మీడియాలో బాగా వినిపిస్తోన్న పేర్లలో శోభిత ధూళిపాళ ఒకరు. చేసింది తక్కువ సినిమాలే అయినప్పటికి అతి తక్కువ కాలంలోనే తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ముఖ్యంగా నాగ చైతన్య వల్ల శోభితా ధూళిపాళ లైఫ్ లైన్‌లోకి వచ్చిందనే చెప్పాలి.సమంతతో విడాకుల తీసుకున్న తర్వాత తెలుగు హీరోయిన్ శోభిత ధూళిపాళతో రిలేషన్‌లో ఉన్నాడనే పుకార్లు షికార్లు చేస్తున్నాయి. దీనికి తగ్గట్టుగానే వీరిద్దరు కలిసి దర్శనం ఇవ్వడంతో ఇదింతా కూడా నిజమే అని అంతా భావిస్తున్నారు. నాగ చైతన్య, శోభిత ధూళిపాళతో కలిసి యూరప్ వెళ్లిన ఫొటోలు వైరల్ అయ్యాయి.
ఓ వైన్ టెస్ట్ పార్టీ జరుగుతుండగా అక్కడ కూడా వీరిద్దరు కలిసి దర్శనం ఇచ్చారు. దీంతో నాగ చైతన్య, శోభిత డేటింగ్‌లో ఉన్నారనేది మరోసారి రుజువు అయింది.ఈ వార్తలను నిజం చేస్తూ..నాగ చైతన్య , శోభిత ధూళిపాళ గురువారం సైలెంట్‌గా నిశ్చితార్థం చేసుకున్నారు. వీరి నిశ్చితార్థానికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అభిమానులు షాక్‌కు గురయ్యారు. ఈ విషయాన్ని నాగార్జున అధికారికంగా ప్రకటించారు. అతి కొద్దిమంది సమక్షంలో వీరు నిశ్చితార్థం జరిగింది. శోభితతో నిశ్చితార్థం చేసుకున్న ఫొటోలను తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో పెట్టడం జరిగింది. ఈ జంటకు పలువురు సినీ సెలబ్రిటీలు అభినందనలు తెలిపారు.

నాగ చైతన్యతో నిశ్చితార్థం తర్వాత శోభిత తొలిసారి స్పందించింది.. నాగ చైతన్యతో రిలేషన్ గురించి చెబుతూ.. వారిద్దరి ఎంగేజ్మెంట్ సమయంలో దిగిన కొన్ని ఫోటోలను ఆమె తన ఇన్‌స్టాలో షేర్ చేసింది శోభిత. మనిద్దరం ఎలా కలిశాము అన్నది ముఖ్యం కాదు.. పరిచయం ఎలా మొదలయినా.. ప్రేమలో మన హృదయాలు కలిసిపోయాయి అంటూ చెప్పుకొచ్చిన శోభిత.. నిశ్చితార్థం సందర్భంగా దిగిన కొన్ని క్యూట్ ఫొటోలను ఈ సందర్భంగా షేర్ చేసింది. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి.












Click it and Unblock the Notifications