సమంత ఎఫెక్ట్ ..పెళ్లికి ముందే గుడ్ బై చెప్పేసిన శోభిత ధూళిపాళ
సోషల్ మీడియాలో బాగా వినిపిస్తోన్న పేర్లలో శోభిత ధూళిపాళ ఒకరు. చేసింది తక్కువ సినిమాలే అయినప్పటికి అతి తక్కువ కాలంలోనే తనకంటూ ప్రత్యేక గుర్తింపు దక్కించుకుంది. ముఖ్యంగా నాగ చైతన్య వల్ల శోభితా ధూళిపాళ లైఫ్ లైన్‌లోకి వచ్చిందనే చెప్పాలి.సమంతతో విడాకుల తీసుకున్న తర్వాత తెలుగు హీరోయిన్ శోభిత ధూళిపాళతో రిలేషన్‌లో మెయిన్‌టైన్ చేశారు. ఈక్రమంలోనే నాగ చైతన్య , శోభిత ధూళిపాళ సైలెంట్‌గా నిశ్చితార్థం చేసుకున్నారు.
వీరి నిశ్చితార్థానికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అభిమానులు షాక్‌కు గురయ్యారు. అతి కొద్దిమంది సమక్షంలో వీరి నిశ్చితార్థం జరిగింది. ఇక త్వరలోనే వీరి పెళ్లి జరగనుంది. అయితే పెళ్లికి ముందే శోభితా ధూళిపాళ కీలక నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. పెళ్లి తర్వాత శోభిత ఎలాంటి బోల్డ్ వెబ్ సిరీస్‌లు కానీ సినిమాలలో కానీ నటించకూడదనే నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. నాగ చైతన్య కోరడంతోనే ఆమె దీనికి ఒప్పుకున్నారని సమాచారం.సమంత విషయంలో జరిగిన తప్పు తిరిగి శోభిత విషయంలో జరగకుండా ఉండటం కోసం నాగచైతన్య ముందస్తు జాగ్రత్త తీసుకున్నారని తెలుస్తుంది.

సమంత నాగచైతన్య విడాకులు తీసుకొని విడిపోవడానికి కారణం సినిమాలే అని తెలుస్తుంది. సమంత ఎప్పుడైతే 'ది ఫ్యామిలీ మెన్' వెబ్ సిరీస్‌లో నటించారో ఆ వెబ్ సిరీస్ కారణంగానే వీరిద్దరి మధ్య గొడవలు వచ్చాయని అదే విడాకులకు కారణమైందంటూ ఒకానొక సమయంలో వార్తలొచ్చాయి.దీంతో అలాంటి పొరపాటు మళ్లీ జరగకూడదనే ఉద్దేశంతోనే నాగ చైతన్య,శోభిత విషయంలో జాగ్రత్తపడుతున్నారట. తాజాగా నాగ చైతన్య , శోభిత ధూళిపాళ పెళ్లికి సంబంధించిన వెడ్డింగ్ కార్డు నెట్టింట వైరల్‌గా మారింది.
డిసెంబర్ 4వ తేదీన వీరి వివాహం ఘనంగా జరగనుంది. నాగ చైతన్య, శోభితా ధూళిపాళల పెళ్లి కార్డును అక్కినేని ఫ్యామిలీ సోషల్ మీడియాలో షేర్ చేశారు. అన్నపూర్ణ స్టూడియోలోనే పెద్ద సెట్ వేసి , అక్కడే వివాహం జరిపించబోతున్నట్లు తెలుస్తోంది. డిసెంబర్ 4న జరిగే వివాహంతో అక్కినేని ఇంట్లో శోభిత అడుగుపెట్టబోతోంది. ఈ విషయం తెలుసుకున్న అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఇక శోభిత కెరీర్ విషయానికి వస్తే, తెలుగు, తమిళ, హిందీ బాషాల్లో ఆమె నటిస్తోంది. ఇటీవల శోభిత 'మంకీ మ్యాన్'తో ప్రేక్షకులను అలరించింది. ఇక ప్రజెంట్ ఈ అమ్మడు నటించిన ఓటీటీ సినిమా 'లవ్ సితార' జీ5లో స్ట్రీమింగ్ అందుబాటులోకి వచ్చింది.












Click it and Unblock the Notifications