విడాకుల బాటలో తెలుగు హీరోయిన్..? భర్తకు గుడ్ బై

ఇటీవల కాలంలో విడాకులు తీసుకునే వారి సంఖ్య ఎక్కువగా ఉంది. అందులోనూ సెలబ్రిటీల గురించి అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఎప్పుడు ఏ సెలబ్రిటీలు విడాకలు గురించి ప్రకటిస్తారో తెలియని పరిస్థితి. సినిమా షూటింగ్ సమయంలో ప్రేమించి పెళ్లి చేసుకోవడం , ఆ తర్వాత ఒకరినొకరు అర్థం చేసుకోలేక , కలిసి ఉండలేక విడాకుల బాట పడుతున్నారు. చాలామంది సెలబ్రిటీల జీవితాలు ఇలాగే ఉన్నాయి. భాషతో సంబంధం లేకుండా సెలబ్రిటీలు చాలామంది విడాకులు తీసుకుంటున్నారు. తాజాగా ఓ హీరోయిన్ విడాకులకు రెడీ అవుతున్నారని తెలుస్తోంది. ఆ హీరోయిన్ మరెవరో కాదు..హన్సిక.

బాల నటిగా కెరీర్‌ను మొదలుపెట్టిన హన్సిక .. కొన్ని సినిమాల్లో నటించి మెప్పించింది. కానీ అల్లు అర్జున్ హీరోగా నటించిన 'దేశ ముదురు' సినిమాతోనే ఆమె హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. 2007, జనవరి 12న విడుదలైన ఈ సినిమాకు పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించారు. బాక్సాఫీస్ వద్ద 'దేశ ముదురు' సూపర్ హిట్‌గా నిలిచింది. హన్సిక అందాలకు కోట్లాది మంది అభిమానులు ఫిదా అయ్యారు. ఒక్క సినిమాతోనే ఆమె స్టార్ హీరోయిన్‌గా మారిపోయింది.

Social media is abuzz with rumors that heroine Hansika is getting ready for divorce

'దేశ ముదురు' సినిమా తర్వాత హన్సికకు వరుస ఆఫర్లు వెల్లువెత్తాయి. తెలుగులో కంటే కూడా ఎక్కువగా ఈ అమ్మడు తమిళంలోనే సక్సెస్ సాధించింది. తమిళ టాప్ హీరోల సరసన నటించే అవకాశాలు హన్సికకు దక్కాయి. తమిళంలో ఆమెకు ప్రత్యేకమైన అభిమాణగణం ఉంది. అభిమానులు హన్సికకు గుడి కూడా కట్టారంటే ఆమె రేంజ్ ఎంతలా ఉందో అర్థం చేసుకోవచ్చు.ఇదే సమయంలో సినిమాల్లో అవకాశాలు కూడా తగ్గిపోవడంతో.. పెళ్లి పీటలెక్కిసింది.

సొహైల్ అనే వ్యక్తిని హన్సిక ప్రేమించి పెళ్లి చేసుకుంది. హ‌న్సిక‌కు ఇది మొద‌టి వివాహం కాగా సొహైల్‌కు మాత్రం ఇది రెండోది. హన్సిక మోత్వానీ తన క్లోజ్‌ ఫ్రెండ్‌ రింకీ మాజీ భర్త సోహెల్ ఖతురియాను పెళ్లి చేసుకుంది. 2016లో రింకీతో సోహైల్ కతురియా మొదటి వివాహం జరిగింది. కొన్నాళ్లకే వీరిద్దరు విడిపోయారు. రింకీతో విడాకులు తీసుకున్న తర్వాత సోహెల్ ఖతురియా హ‌న్సిక‌తో ప్రేమలో పడ్డాడు. తన బెస్ట్ ఫ్రెండ్ ద్వారానే సోహెల్‌ను కలిసినట్టు హన్సిక ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పేర్కొంది.

వీరి పెళ్లికి హన్సిక స్నేహితురాలు రింకీ కూడా హాజరైనట్లు ఆమె తెలిపింది. 2022 డిసెంబర్‌ 4న జైపూర్‌లోని ముండోటా కోట ప్యాలెస్‌లో వీరి పెళ్లి ఘనంగా జరిగింది. కాగ గత కొంతకాలంగా వీరిద్దరు విడిపోతున్నారంటూ ప్రచారం జరుగుతుంది. ఇప్పటికే ఈ జంట విడి విడిగా ఉంటున్నారని తెలుస్తోంది. సరిగ్గా ఇదే సమయంలో హన్సిక కొద్ది రోజులుగా తన సింగిల్ ఫొటోలను మాత్రమే సోషల్ మీడియాలో షేర్ చేస్తుంది. దీనికి తోడు సోషల్ మీడియాలో భర్త సోహైల్ కతురియాను అన్‌ఫాలో చేసినట్టు తెలుస్తోంది. దీంతో వీరు విడాకులు తీసుకోవడం ఖాయమనే మాటలు వినిపిస్తున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+