అసలు ఈమె అవసరమా బిగ్ బాస్‌లో.. నాగార్జున గారు ఎలిమినేట్ చేసేయండి !

తెలుగు బుల్లితెరపై అత్యంత ప్రజాదరణ పొందిన రియాలిటీ షో 'బిగ్ బాస్'. ప్రతి సీజన్ కొత్త ట్విస్టులు, అనుకోని డ్రామాలతో ప్రేక్షకులను ఉత్కంఠకు గురి చేస్తోంది. ప్రస్తుతం నడుస్తున్న బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 కూడా అదే థ్రిల్లింగ్ ట్రాక్‌పై సాగుతోంది. సీక్రెట్ టాస్కులు, సడెన్ ఎలిమినేషన్లు, వైల్డ్‌కార్డ్ ఎంట్రీలు అన్నీ కలసి హౌస్ వాతావరణాన్ని హీట్ చేస్తూనే ఉన్నాయి. గత ఐదు వారాలుగా నత్తనడకలో సాగిన షో.. 6వ వారం నుంచి కొత్త ఉత్సాహాన్ని సంతరించుకుంది.

బిగ్ బాస్ హౌస్‌లోకి ఆరుగురు వైల్డ్‌కార్డ్ కంటెస్టెంట్లు అడుగుపెట్టడంతో గేమ్ దిశే మారిపోయింది. వైల్డ్‌కార్డ్ ఎంట్రీలతో ఇంట్లో డ్రామా ముమ్మరంగా కొనసాగుతుండగా.. భరణి షాకింగ్ ఎలిమినేషన్ ప్రేక్షకులను ఒక్కసారిగా కుదిపేసింది. ఆ ఎలిమినేషన్ తర్వాత షో 7వ వారంలోకి ప్రవేశించింది. ఇప్పుడు గేమ్ మరింత రమైంది. హౌస్‌లో మైండ్ గేమ్స్, గ్రూప్ పొలిటిక్స్, స్ట్రాటజీలు ముదురుతున్నాయి.

social-media-trolling-on-sanjana-galrani-in-bigg-boss-telugu

అయితే ఈ వారం వచ్చిన నామినేషన్లలో సంజనా పేరు కూడా ఉంది. హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన దగ్గరి నుంచి ఏదో ఒక రకంగా కంటెంట్ క్రియేట్ చేయాలని ట్రై చేస్తూనే ఉంటుంది. మధ్యలో అమ్మాయిలకే సపోర్ట్ చేస్తారు అంటూ కాంట్రవర్సీకి తెరలేపి, గుడ్డు దొంగతనంతో బుక్ అయ్యింది. అమ్మ సెంటి మెంట్ తో ఇమ్మానుయేల్ పక్కన ఉంటూ ఫాలోవర్స్ సపోర్ట్ కోసం అలా అలా ఉంటుంది. కానీ అందరినీ ఆశ్చర్యపరిచేలా మిడ్ వీక్ ఎలిమినేషన్ డ్రామా చోటు చేసుకుంది.

అందులో భాగంగా సంజనా గల్రానీని హౌస్ నుంచి బయటకు పంపించారు. ఆమెను తిరిగి హౌస్‌లోకి పంపేందుకు నలుగురు కంటెస్టెంట్లు త్యాగాలు చేయాలని బిగ్ బాస్ కండిషన్ పెట్టాడు. సంజన కోసం కెప్టెన్సీని త్యాగం చేయమని బిగ్ బాస్ ఆదేశించగా, కంటెస్టెంట్ ఇమ్మాన్యుయెల్ ఎలాంటి ఆలోచన లేకుండా తన కెప్టెన్సీని వదిలేశాడు. తనతోపాటు మరో ముగ్గురు కంటెస్టెంట్లు కూడా త్యాగాలకు ముందుకొచ్చారు. అలా వారి త్యాగాల వల్ల సంజనా మళ్లీ బిగ్ బాస్ హౌస్‌లోకి రీఎంట్రీ ఇచ్చింది.

అయితే రీఎంట్రీ తర్వాత సంజనా ఇంకా నెగిటివ్ మూటగట్టుకుంటుంది. రీసెంట్ గానే మరో కంటస్టెంట్ మాధురితో కలిసి ఓ ఫన్ ప్రాంక్ ప్లాన్ చేసింది. కానీ ఈ వారంలో మాత్రం తనుజా విషయంలో తన మాటలు వల్ల అభిమానులు ఆమెపై ఫైర్ అవుతున్నారు. చెప్పాల్సిన పాయింట్ లను వదిలేసి అమ్మాయిని బ్యాడ్ చేస్తుందని కామెంట్స్ చేస్తున్నారు. కేవలం ఓట్ల కోసం ఇమ్మానుయేల్ పక్కన ఉంటూ నెట్టుకొస్తూ ఇప్పుడు ఇలా మిగతా వారిని అనడం కరెక్ట్ కాదని మండిపడుతున్నారు. దాంతో ఈ వీక్ ఎలిమినేట్ అయ్యేది ఆమె అంటూ ట్రోల్స్ వస్తున్నాయి.

social-media-trolling-on-sanjana-galrani-in-bigg-boss-telugu

సంజనా గల్రానీ కెరీర్‌..

ఇక సంజనా సినిమాల విషయానికి వస్తే.. తరుణ్ హీరోగా నటించిన "సోగ్గాడు" (2005) సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. తర్వాత పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా వచ్చిన "బుజ్జిగాడు" సినిమాలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత పోలీస్ పోలీస్, సత్యమేవ జయతే, యమహో యమ, ముగ్గురు, లవ్ యూ బంగారం, అవును 2, సర్దార్ గబ్బర్ సింగ్ వంటి తెలుగు చిత్రాల్లో నటించింది. అలాగే తమిళం, కన్నడంలో కూడా పలు సూపర్‌హిట్ సినిమాలు చేసి సౌత్‌ ఫిల్మ్ ఇండస్ట్రీలో తనదైన ఇమేజ్‌ ఏర్పరచుకుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+