ఏపీలో జూనియర్ ఎన్టీఆర్ సినిమాలు ఆడటం కష్టమే?
తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అరెస్ట్ కావడంతో పార్టీ అభిమానులు పలువురు జూనియర్ ఎన్టీఆర్ పై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. చంద్రబాబు అరెస్ట్ ను తారక్ ఖండించకపోవడంతో సోషల్ మీడియాలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు వర్సెస్ జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల మధ్య యుద్ధం నడుస్తోంది.
ఈ క్రమంలోనే తెలుగుదేశం పార్టీకి చెందిన ఒక అభిమాని స్వయంగా తారక్ కు ఫోన్ చేసి మరీ సినిమాల విషయంలో స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారనే వార్త ప్రస్తుతం వైరల్ గా మారింది. చంద్రబాబు అరెస్టును వ్యతిరేకిస్తూ ఎన్టీఆర్ తన మద్దతు తెలియజేయకపోవడంతో ఆయన నటించిన సినిమాలను ఏపీలో ఆడనివ్వం అంటూ హెచ్చరించినట్లు తెలుస్తోంది. దీనికి తారక్ అభిమానులు కూడా తమదైన శైలిలో కౌంటర్లు ఇచ్చారు. నిజంగా దమ్ము, ధైర్యం ఉంటే ఎన్టీఆర్ సినిమా ఒక్క షో ఆపి చూడండంటూ సవాల్ విసిరారు.

ఇలా ఒకరిపై ఒకరు సవాళ్లు విసుకుంటూ పెద్ద ఎత్తున మాటల యుద్ధాన్ని కొనసాగిస్తున్నారు. విమర్శలు వచ్చినప్పటికీ ఎన్టీఆర్ మాత్రం ఇప్పటివరకు ఈ విషయంపై స్పందించలేదు. చంద్రబాబు విషయంలో ఎన్టీఆర్ మౌనంగా ఉండడానికి కూడా ఎన్నో కారణాలు ఉన్నాయి అవన్నీ తెలియజేయాల్సిన అవసరం లేదు అంటున్నారు. ప్రస్తుతం దేవర సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా రెండు భాగాలుగా రానుంది. ఈ విషయాన్ని చిత్ర దర్శకుడు కొరటాల శివ ఇటీవలే స్వయంగా ప్రకటించారు.












Click it and Unblock the Notifications