మద్యానికి బానిసైంది ఎవరు?
డార్లింగ్ ప్రభాస్ బాహుబలి సినిమాతో దేశవ్యాప్తంగా క్రేజ్ తెచ్చుకున్నారు. కల్కి సినిమాతో అంతర్జాతీయస్థాయి హీరోగా మారిపోతున్నారు. ప్రభాస్ క్రేజ్ ఎలా ఉందంటే బాహుబలి తర్వాత వచ్చిన సాహో, రాధేశ్యామ్, ఆదిపురుష్ ఫ్లాపైనప్పటికీ కలెక్షన్లు మాత్రం మొదటి మూడురోజులు భారీస్థాయిలో ఉంటున్నాయి. ప్రభాస్ సినిమా అంటే మొదటి మూడురోజులు రూ.300 కోట్లు ఖాయం అనేలా పరిస్థితి మారిపోయింది. అలాగే మరో తెలుగు హీరో అల్లు అర్జున్ కూడా పుష్ప సినిమాతో పాన్ ఇండియా హీరో అయిపోయారు. పుష్ప2 పై అంచనాలు భారీగా ఉన్నాయి.
ప్రస్తుతం సోషల్ మీడియాలో వీరిద్దరి అభిమానులు భారీగా పోట్లాడుకుంటున్నారు. ప్రభాస్ లాటరీ స్టార్ అని, రాజమౌళి వల్లే పాన్ ఇండియా హిట్ కొట్టాడంటూ అల్లు అర్జున్ అభిమానులు కామెంట్ చేస్తుండగా పీఆర్ టీంతో లేని ఇమేజ్ ను బన్నీ క్రియేట్ చేసుకుంటాడని, సర్జరీల హీరో అని, అతనిది అంతా ఫేక్ ఇమేజ్ అని ట్రోల్ చేస్తున్నారు. ఇలా నిత్యం ప్రభాస్-అల్లు అర్జున్ ఫ్యాన్స్ మధ్య గొడవులు జరుగుతూనే ఉంటాయి.

మీ హీరో తాగుబోతు అంటే మీ హీరో తాగుబోతు అంటూ మరోసారి అభిమానులు యుద్ధానికి దిగారు. అల్లు అర్జున్ కు ఆల్కహాల్ అలవాటుందని నిరూపించే కొన్ని ఫొటోలను షేర్ చేస్తూ ఎక్స్ లో థ్రెడ్ వదిలాడు. ఒక పోస్ట్ లో బన్నీ తనకు ఆల్కహాల్ అలవాటుందని చెప్పిన వీడియో కూడా ఉంది. ప్రభాస్ కు కూడా ఆల్కహాల్ అలవాటుందని బన్నీ అభిమానులు ప్రచారం చేస్తున్నారు.
ప్రభాస్ ఆరోగ్యం చెడిపోవడానికి ఎక్కువగా మందు తాగడమేనని ఎగతాళి చేస్తున్నారు. ఇలా ఫ్యాన్స్ మధ్య వార్ తారస్థాయికి చేరుకుంటుంది. దారుణంగా తిట్టుకోవడమే కాకుండా కామెంట్లు చేస్తుంటారు. వీళ్లు ఇలా తన్నుకోవడమేకానీ అల్లు అర్జున్ - ప్రభాస్ మంచి స్నేహితులు అనే విషయం తెలిసిందే. వారిని చూసైనా అభిమానులు మారాలంటున్నారు.












Click it and Unblock the Notifications