విడాకులు తీసుకున్న రోహిత్ శర్మ మాజీ లవర్
ఇటీవల కాలంలో విడాకులు తీసుకునే వారి సంఖ్య ఎక్కువుగానే ఉంది. అందులోనూ సెలబ్రిటీల గురించి అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన పనే లేదు. ఏ రోజు ఏ సెలబ్రిటీ విడాకులు గురించి ప్రకటిస్తారో అనే విధాంగా పరిస్థితి మారిపోయింది. కలిసి ఉండలేక స్టార్స్ ఇలా విడాకుల బాట పడుతున్నారు. చాలామంది సెలబ్రిటీల జీవితాలు ఇలాగే ఉన్నాయి. తమ లైఫ్ పార్టనర్‌తో రాజీ పడకపోవడం, అత్తింటి గొడవలు ,పెళ్లి తరువాత కూడా కెరీర్ కొనసాగించడం, పర్సనల్ లైఫ్‌ను మెయిన్‌టైయిన్ చేయడం మొదలగు కారణాలతో విడాకులు బాట పడుతున్నారు.
తాజాగా బాలీవుడ్ బ్యూటీ సోఫియా హయాత్ విడాకులు తీసుకుని ఏకంగా సన్యాసిగా మారడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.సోఫియా హయాత్ తెలుగు ప్రేక్షకులకు పెద్దగా తెలియకపోవచ్చు కానీ, బాలీవుడ్ జనాలకు ఈ భామ సుపరిచితమే. బిగ్‌బాస్ రియాలిటీ షో ద్వారా ఫుల్ పాపులారిటీని సంపాదించుకున్న ఈ భామ, పలు సినిమాల్లో స్పెషల్ సాంగ్స్‌లో నటించింది. ఐటం సాంగ్స్‌లో నటించి బాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు దక్కించుకుంది.

ఈ భామ బ్రిటన్‌లోని ఓ ముస్లిం కుటుంబంలో జన్మించిన సోఫియా హయాత్ సినిమాల మీద మక్కువతో ఇండియాకు వచ్చింది.'క్యాష్ అండ్ కర్రీ' సినిమాతో బాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. ఆ తర్వాత సిక్స్ ఎక్స్, అక్సర్ 2 వంటి చిత్రాల్లో నటించి ఫుల్ ఫేమస్ అయింది. ఈ సమయంలోనే ప్రస్తుతం టీమిండియా కెప్టెన్‌తో కొన్ని రోజులు డేటింగ్ చేసింది. ఈ విషయాన్ని ఆమె స్వయంగా వెల్లడించింది. వీరిద్దరు క్లోజ్‌గా ఉన్న ఫొటోలు సైతం అప్పట్లో బాగానే వైరల్ అయ్యాయి.
ఇక కెరీర్ పీక్స‌్‌లో ఉన్నప్పుడే రోమేనియన్ వ్యాపారవేత్తను సోఫియా వివాహం చేసుకుంది. అయితే వీరి కాపురం ఎక్కువ కాలం నిలవలేదు. పెళ్లైన ఏడాదికే అతడితో విడాకులు తీసుకుంది. విడాకులు తర్వాత హాట్ హాట్ గ్లామర్‌తో యూత్‌కు పిచ్చెక్కించింది. ఏం జరిగిందో తెలియదు కానీ సోఫియా అనూహ్య నిర్ణయం తీసుకుంది. గ్లామర్ ప్రపంచాన్ని వదిలి.. ఆధ్యాత్మిక ప్రపంచంలోకి వెళ్లింది. తాను గ్లామర్ ప్రపంచాన్ని త్యజిస్తూ సన్యాసిని అయ్యానని ప్రకటించి అందరిని షాక్‌కి గురిచేసింది. ప్రస్తుతం ఆమె సన్యాసిగా మారిన కొన్ని ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి.












Click it and Unblock the Notifications