వెన్నుపోటు పొడుస్తున్నవారెవరో జూనియర్ ఎన్టీఆర్‌కు తెలుసు?
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ మొదటినుంచి ఏ సినిమా చేస్తున్నా దానిమీద సాధారణంగా వ్యతిరేక ప్రచారం వ్యాప్తిలోకి వస్తుంది. దీనికి కారణం ఏమిటి? అనే విషయం అభిమానులకు కూడా అంతుపట్టకుండా ఉంది. అది ఏ బ్యానర్ అయినాకానీ, ఏ దర్శకుడైనాకానీ, ఎన్ని పెద్ద పెద్ద హంగులు ఉన్నప్పటికీ జూనియర్ ఎన్టీఆర్ హీరో అయితే చాలు వెంటనే ఆ సినిమా మీద వ్యతిరేక ప్రచారం మొదలవుతుంది. ఈ ప్రచారం వెనక తెలుగు సినీ పరిశ్రమకు చెందిన బడా స్టార్ హస్తం ఉన్నట్లు తెలుస్తోంది.
ఎవరికి లాభం కలుగుతోంది?
జూనియర్ ఎన్టీఆర్ సినిమాలు నిజంగానే ప్రేక్షకులకు నచ్చడంలేదా? సినిమా బాగోపోతే సహజంగానే వ్యతిరేక ప్రచారం వస్తుంది. అదికూడా సినిమా విడుదలైన తర్వాత. అయితే విడుదలకు ముందే ఇలా జరగడం తారక్ దురదృష్టమని చెప్పొచ్చు. కర్ణుడి చావుకు అనేక కారణాలని భారతంలో ఓ సామెత ఉంటుంది. అందుకు తగ్గట్లుగానే ఎన్టీఆర్ సినిమా విడుదలవుతోంది అంటే వ్యతిరేక ప్రచారం జరగడం కూడా సహజంగా మారిపోయింది. దీని వెనకాల ఎవరు ఉన్నారు? ఎందుకు చేస్తున్నారు? కారణం ఏమిటి? వారికి ఒనగూరే లాభం ఏమిటి? ఇలా చేయడంవల్ల వారిలో ఎవరికి లాభం కలుగుతోంది? ఎవరెవరు దీని వెనకాల ఉన్నారు? అనే విషయాలు తెలుసుకోలేనంత అమాయకుడేంకాదు జూనియర్ ఎన్టీఆర్.

వాస్తవం తారక్ కే తెలియాలి
అయితే మనిషి ఎంతో ఓర్పుగా ఉంటాడు. సమయం వచ్చినప్పటికీ తన మానాన తాను పనిచేసుకుంటూ వెళతాడుకానీ వారు తన సినిమాలపై, తనపై ఇలా చేశారనే విషయాన్ని మనసులో పెట్టుకోడు. సినిమాలపైనే దృష్టిపెడతాడు. 2009లో టీడీపీ తరఫున ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న తర్వాత యాక్సిడెంట్ లో గాయపడ్డాడు. ఆ తర్వాత రాజకీయాలకు పూర్తిగా దూరం జరిగాడు. కేవలం సినిమాలపైనే దృష్టిపెట్టాడు. ఈ క్రమంలోనే పలు హిట్లు, ఫ్లాప్ లు అందించాడు. తాజాగా దేవర సినిమా ఈ నెల 27వ తేదీన విడుదల కాబోతోంది. ఎన్టీఆర్ సినిమాలపై వ్యతిరేక ప్రచారం చేయడంవల్ల నిర్మాతలెవరూ భవిష్యత్తులో అతనితో సినిమాలు తీయకూడదనేది ఇలా చేసేవారి ఉద్దేశమని తెలుస్తోంది. అయితే వారెవరు? అనే విషయంలో సోషల్ మీడియాలో ఎన్టీఆర్ అభిమానులు రకరకాల హీరోలు, నిర్మాతల పేర్లు చెబుతున్నారుకానీ వాటిల్లో వాస్తవమెంత? అనేది జూనియర్ ఎన్టీఆర్ కే తెలియాలి.












Click it and Unblock the Notifications