100 మిలియన్ వ్యూస్‌తో ఓటీటీని షేక్ చేస్తోన్న క్రైమ్ థ్రిల్లర్ ..స్ట్రీమింగ్ ఎక్కడంటే..?
మలయాళంలో విమర్శకుల ప్రశంసలు పొందిన చిత్రం 'సూత్రవాక్యం' ఇప్పుడు తెలుగు ప్రేక్షకులను కూడా విశేషంగా ఆకట్టుకుంటోంది. ఈ సినిమా ఈటీవీ విన్ మరియు అమెజాన్ ప్రైమ్లలో ఆగస్టు 21న స్ట్రీమింగ్ ప్రారంభమై, అనతికాలంలోనే ఓటీటీ ప్రపంచంలో సరికొత్త రికార్డు సృష్టించింది. కేవలం కొన్ని రోజుల్లోనే ఏకంగా 100 మిలియన్ వ్యూస్ సాధించి, డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లో తన సత్తా చాటింది. ఈ సినిమాకు ఇంత గొప్ప విజయం సాధించడం పట్ల నిర్మాతలు కాండ్రేగుల లావణ్యాదేవి - కాండ్రేగుల శ్రీకాంత్ హర్షం వ్యక్తం చేశారు.
పోలీసు వ్యవస్థపై ఉన్న సంప్రదాయ ఆలోచనలను ప్రశ్నిస్తూ ఈ సినిమా తెరకెక్కింది. పోలీసులు అంటే కేవలం నేరాలను పరిష్కరించే వారే కాకుండా, ఖాళీ సమయంలో పిల్లలకు పాఠాలు చెప్పి సమాజంలో మార్పు తీసుకురావాలనే విప్లవాత్మకమైన అంశాన్ని ఇందులో చూపించారు. ఈ వినూత్నమైన ఆలోచనకు గ్రిప్పింగ్ స్క్రీన్‌ప్లే, ఉత్కంఠభరితమైన కథనం తోడవ్వడంతో ప్రేక్షకులకు విపరీతంగా నచ్చింది.

కథ
ఈ కథ పోలీస్ అధికారి క్రిస్టో జేవియర్ (షైన్ టామ్ చాకో) చుట్టూ తిరుగుతుంది. అతను కేవలం తన విధులను నిర్వర్తించడమే కాకుండా, తన స్టేషన్‌లోనే పిల్లలకు ఉచితంగా పాఠాలు చెబుతుంటాడు. ఇదే సమయంలో, తన ట్యూషన్‌కు వచ్చే ఒక అమ్మాయికి జరిగిన గొడవ కారణంగా ఆమె సోదరుడు అదృశ్యమవుతాడు. ఈ మిస్సింగ్ కేసును దర్యాప్తు చేసే క్రమంలో, ఒక ఊహించని హత్య కేసు వెలుగులోకి వస్తుంది. ఆ మర్డర్ కేసుతో అదృశ్యమైన యువకుడికి ఉన్న సంబంధం ఏమిటి? ఈ క్లిష్టమైన కేసులను క్రిస్టో ఎలా పరిష్కరించాడు? అన్నదే ఈ సినిమా కథ. ఆకట్టుకునే స్క్రీన్‌ప్లే, ఆలోచింపజేసే కథాంశంతో ఈ సినిమా ఓటీటీ ప్రేక్షకులకు మంచి థ్రిల్‌ను అందిస్తోంది. అందుకే, ఇది కేవలం వినోదం కోసం మాత్రమే కాకుండా, సమాజానికి ఒక సందేశం ఇచ్చే చిత్రంగానూ నిలిచింది.












Click it and Unblock the Notifications