స్టార్ హీరోకు ఇప్పట్లో మోక్షం లేనట్లు ఉంది, పాపం సెంట్రల్ జైల్లో !!

శ్యాండిల్ వుడ్ ఛాలెంజింగ్ స్టార్ దర్శన్ కు ఈరోజు బెయిల్ వస్తుందని ఆయన అభిమానులు వెయ్యి కళ్లతో ఎదురు చూశారు. ఇప్పటికే అనారోగ్యంతో బళ్లారి సెంట్రల్ జైల్లో ఉన్న మా హీరో విడుదల కావాలని దర్శన్ అభిమానులు ప్రత్యేక పూజలు చేశారు. అయితే హీరో దర్శన్ అభిమానులు నిరాశ చెందారు. బళ్లారి సెంట్రల్ జైల్లో ఉన్న హీరో దర్శన్ అనారోగ్యంతో బాధపడుతున్నారు.

రేణుకాస్వామి హత్య కేసులో హీరో దర్శన్ అరెస్టు అయ్యి వంద రోజులు పైగా అయింది. హీరో దర్శన్ తో పాటు ఈకేసులో ఏ2 నిందితురాలు, కన్నడ నటి పవిత్ర గౌడ కూడా బెయిల్ కోసం కోర్టును ఆశ్రయించారు. హీరో దర్శన్ కి బెయిల్ తీసుకురావాలని ఆయన భార్య విజయలక్ష్మితో పాటు ఆయన కుటుంబ సభ్యులు, కన్నడ సినీ పరిశ్రమకు చెందిన కొందరు ప్రముఖులు అనేక ప్రయత్నాలు చేస్తున్నారు.

Special court adjourned hearing of Sandlewood hero Darshan s bail petition

లక్షలాది మంది అభిమానులు మా హీరో దర్శన్ జైలు నుండి బయటకు రావాలని అనేక దేవాలయంలో ప్రత్యేక పూజలు కూడా చేస్తున్నారు. హీరో దర్శన్ తనకు బెయిల్ మంజూరు చేయాలని బెంగళూరులోని సీసీహెచ్ ప్రత్యేక కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. శనివారం హీరో దర్శన్ బెయిల్ పిటిషన్ పై విచారణ జరిగింది. ఆ సమయంలో హీరో దర్శన్ తో పాటు నటి పవిత్ర గౌడకు బెయిల్ మంజూరు చేయకూడదని పోలీసుల తరఫున న్యాయవాది కోర్టుకు మనవి చేశారు.

హీరో దర్శన్ కు బెయిల్ మంజూరు చేయాలని, ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారని హీరో దర్శన్ తరపున న్యాయవాదులు కోర్టుకు మనవి చేశారు. ఇరుపక్షాల వాదనను వినిపించారు. ఇరు పక్షాల వాదనలు విన్న న్యాయస్థానం ఇదే నెల 8వ తేదీకి బెయిల్ పిటీషన్ విచారణ వాయిదా వేసింది. హీరో దర్శన్ ఈనెల 8వ తేదీన కచ్చితంగా బెయిల్ పై బయటకు వస్తారని ఆయన అభిమానులు వేయ్యికళ్లతో ఎదురుచూస్తున్నారు. చిత్రదుర్గకు చెందిన రేణుకస్వామిని హత్య చేశారని ఆరోపిస్తూ హీరో దర్శన్ తో పాటు అతని స్నేహితురాలు, కన్నడ నటి పవిత్ర గౌడ తదితరులను బెంగళూరు పోలీసులు అరెస్టు చేసి జైలుకు పంపించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+