'స్పెషల్ న్యూస్' చెప్పబోతున్నా సిద్ధంగా ఉండండి: సమంత

అక్కినేని నాగచైతన్యతో సమంత జీవితం శ్వాశ్వతంగా విడిపోయింది. శోభిత ధూళిపాళతో నాగచైతన్య నిశ్చితార్థం చేసుకున్నాడు. త్వరలోనే వివాహ తేదీని ప్రకటించనున్నారు. అప్పటివరకు సమంత, చైతూ కలిసిపోతారనే ఆశతో ఎదురుచూసిన అక్కినేని అభిమానులు, సమంత అభిమానులు నిరుత్సాహానికి గురయ్యారు. దీనిపై అధికారికంగా ఎక్కడా సమంత మాట్లాడలేదు. ప్రస్తుతం వెబ్ సిరీస్ తో పాటు తన సొంత బ్యానరులో ఓ సినిమా చేస్తోంది. త్వరలోనే మరో వెబ్ సిరీస్ చేసేందుకు సిద్ధమవుతోంది. మయోసైటిస్ కు తీసుకుంటున్న చికిత్స కూడా పూర్తయింది.

డేటింగ్ లో ఉందంటూ వార్తలు
స్టార్ డైరెక్టర్ తో సమంత డేటింగ్ లో ఉందంటూ సామాజిక మాధ్యమాల్లో వార్తలు చక్కర్లు కొట్టాయి. అయితే అందులో ఎలాంటి నిజం లేదని, ఇటువంటి వార్తలను నమ్మొద్దంటూ సమంత సన్నిహితులు కోరారు. శోభితతో నాగచైతన్య నిశ్చితార్థం చేసుకున్న తరుణంలో సమంత ఏ పోస్టు పెడుతున్నా అందులో ఏదో ఉంటుందనే కుతూహలం అందరిలో నెలకొంది. అందుకే ఏ చిన్న వార్త వచ్చినా దాన్నిగురించి చిలవలు పలువలుగా చెప్పుకుంటున్నారు. తాజాగా తన ఇన్ స్టాగ్రామ్ ఖాతా ద్వారా ఓ స్పెషల్ న్యూస్ రాబోతున్నట్లు సమంత ప్రకటించింది. దీనిపై అభిమానులు అయోమయంలో పడ్డారు.

special news announcement by samantha coming soon

సంథింగ్ స్పెషల్ రాబోతోంది
రెడీగా ఉండండి.. ఈరోజు సంథింగ్ స్పెషల్ రాబోతోంది అంటూ అందులో రాసుకొచ్చింది. దీంతోపాటు వాడిపోయిన ఆకులున్న కొమ్మ ఫొటోను పెట్టింది. ప్రస్తుతం సమంత పెట్టిన పోస్టు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. తన కొత్త సినిమా గురించి చెబుతుందని కొందరు అంటుంటే.. మరికొందరు తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయం ఏదైనా చెప్పబోతుందేమోనని అంటున్నారు. సమంత కూడా నాగచైతన్యలా ఎవరితోనైనా నిశ్చితార్థం చేసుకుంటుందా? అదేనా ఆమె చెప్పబోయే ప్రత్యేక వార్త అని చర్చించుకుంటున్నారు. అయితే సమంత అభిమానులు మాత్రం వాటిని కొట్టేస్తున్నారు. తన కొత్త సినిమాకు సంబంధించి కీలకమైన ప్రకటన చేయబోతోందని, అదే ఆ వార్తలోని సారాంశమని అంటున్నారు. మరి ఎవరిది నిజమవుతుందో తెలియాలంటే కొద్దిగంటలు ఎదురు చూడక తప్పదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+