చెల్లిగా నటించిన హీరోయిన్‌పైనే రేప్..కట్ చూస్తే
సినిమాల్లో నటించే వారు క్యారెక్టర్లు మాత్రమే పట్టించుకోవాలి. ఎందుకంటే ఇండస్ట్రీలో విభిన్న పాత్రల్లో నటించాల్సి ఉంటుంది. గతంలో చాలామంది హీరో, హీరోయిన్లగా నటించిన చాలామంది , తర్వాత అన్న, చెల్లెలుగా నటించారు. భార్య, భర్తలుగా నటించిన కొందరు అన్న, వదినలుగా కనిపించిన సినిమాలు ఎన్నో ఉన్నాయి. సరిగ్గా ఇలాంటి ఘటన హీరోయిన్ అనుష్క సినీ జీవితంలో చోటు చేసుకుంది. తనకు అన్నగా నటించిన , నటుడుతోనే తర్వాత సినిమాలో అసభ్యకరమైనరీతిలో నటించాల్సి వచ్చింది.
విచిత్రం ఏమటింటే ఆ సినిమా వీరిద్దరి కెరీర్‌లను మార్చివేసింది. నాగార్జున నటించిన 'సూపర్' సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచియం అయిన అనుష్క అనతి కాలంలోనే స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. ముఖ్యంగా 'అరుంధతి' సినిమాతో అనుష్క రేంజ్ ఒక్కసారిగా మారిపోయింది. తెలుగులో హీరోలతో సమానంగా అనుష్కకు మార్కెట్ ఉందంటే అతిశేయోక్తి కాదు. అయితే గత కొంతకాలంగా అనుష్క సినిమాలు చేయడం తగ్గించేసిందనే చెప్పాలి.

'జీరోసైజ్' సినిమాతో లావు పెరగిన అనుష్క తరువాత బరువు తగ్గడానికి చాలా ప్రయత్నాలు చేసింది. దాదాపు 100 కేజీలకు పైగా బరువు పెరిగి షాకిచ్చింది. ఆవెంటనే 'నిశ్శబ్దం' సినిమా కోసం బరువు తగ్గి మాములు స్థితిలోకి వచ్చింది. గతేడాది యంగ్ హీరో నవీన్ పోలిశెట్టితో కలిసి 'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి' సినిమాతో అనుష్క ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని నమోదు చేసుకుంది.
ఇదిలా ఉంటే అనుష్క నటించిన మొదటి సినిమా సూపర్‌లో ఆమెకు అన్నయ్యగా సోను సూద్ నటించారు. వీరిద్దరు కలిసి ఈ సినిమాలో అన్న, చెల్లులుగా నటించారు. ఆ తర్వాత ఇదే సోన్ సూద్ 'అరుంధతి' సినిమాలో అనుష్కను అనుభవించాలనే క్యారెక్టర్‌లో నటించారు. బాక్సాఫీస్ వద్ద 'అరుంధతి' సినిమా ఎంతటి సంచలన విజయం సాధించిందో అందరికి తెలిసిందే. ముఖ్యంగా ఈ సినిమాలో సోను సూద్ నటన గురించి ఎంత చెప్పుకున్న తక్కువే. 'అరుంధతి' సినిమాతో సోను సూద్ స్టార్ విలన్‌గా మారిపోగా, అనుష్క స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకుంది.












Click it and Unblock the Notifications