Spirit Movie : ప్రభాస్ స్పిరిట్ సినిమాలో నేషనల్ క్రష్ రష్మిక మందన్నా...
బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు. రెండు భాగాలుగా వచ్చిన బాహుబలి సినిమా ఎంతటి విజయాన్ని అందించిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమా తర్వాత ప్రభాస్ అన్నీ పాన్ ఇండియా సినిమాలే చేస్తున్నాడు. అయితే, ఇటీవల విడుదలయిన ప్రభాస్ సలార్ సినిమా కూడా మంచి హిట్ ఇచ్చింది. ప్రస్తుతం ప్రభాస్ చేతిలో భారీ ప్రాజెక్టులే ఉన్నాయి. అందులో కల్కి, రాజాసాబ్, స్పిరిట్ వంటి ప్రాజెక్టులు ఉన్నాయి. యానిమల్ సినిమా దర్శకుడు సందిప్ వంగాతో కలిసి ప్రభాస్ ఓ సినిమా చేయబోతున్నాడు. అదే స్పిరిట్ సినిమా. ఈ చిత్రం పాన్ ఇండియా లెవల్లో చిత్రీకరించబడుతుంది. ఇప్పడు ఈ సినిమా గురించి సోషల్‌మీడియాలో ఓ వార్త తెగ ప్రచారమవుతోంది. ఈ సినిమాలో ప్రభాస్ సరసన రష్మికను తీసుకోబోతున్నట్లు తెగ వార్తలోస్తున్నాయి. యానిమల్ సినిమాలో రష్మిక నటించిన విషయం అందరికీ తెలిసిందే.
మరోసారి సందిప్ వంగ ఈ అమ్మడునే తన సినిమాలో పెట్టుకోబోతున్నట్లు తెలుస్తోంది. ఈ వార్త కాస్త ఇప్పడు నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. రష్మికతో పాటు రెండో హీరోయిన్ కూడా స్పిరిట్ సినిమాలో ఉండబోతుందని టాక్ వినిపిస్తోంది. స్పిరిట్ సినిమాలో ప్రభాస్ ఓ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించబోతున్నారని తెలుస్తోంది. ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా త్వరలోనే ప్రారంభమవుతాయని దర్శకుడు సందీప్ వంగ తెలిపారు. ఇక, ఈ సినిమాలో రష్మికను తీసుకుంటున్నట్లు వార్తలోస్తున్నాయి.

అయితే, ఈ విషయంపై అటు రష్మిక కానీ, చిత్ర యూనిట్ కానీ స్పందించలేదు. అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. నేషనల్ క్రష్ రష్మిక చేతిలో ఇప్పడు భారీ ప్రాజెక్టులున్నాయి. పుష్ప2 మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధంగా ఉంది. ఈ అమ్మడు స్పిరిట్ సినిమాలో ప్రభాస్ సరసన నటిస్తుంది అనగానే అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఏడాది చివరిలో ఈసినిమా షూటింగ్ ప్రారంభం అవుతున్నట్లు సమాచారం. పాన్ ఇండియా తరహాలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలే ఉన్నాయి.












Click it and Unblock the Notifications