కుబేరుడు వలలో చిక్కుకున్న ఐశ్వర్య రాయ్..?
ఐశ్వర్య రాయ్ అంటే కేవలం ఒక పేరు మాత్రమే కాదు, భారతీయ సినీ పరిశ్రమలో ఒక బ్రాండ్. ఆమె అందం, అభినయం, కెరీర్ అంతా కలిపి ఆమెను ఒక ప్రత్యేక స్థానానికి తీసుకెళ్లాయి.1994లో విశ్వసుందరిగా ఎంపికైన ఐశ్వర్య రాయ్, తన అందంతో ప్రపంచాన్ని మంత్ర ముగ్ధులను చేసింది. ఆమె విజయం భారతీయ మహిళలకు ఒక స్ఫూర్తిగా నిలిచింది. విశ్వసుందరిగా గెలిచిన తర్వాత, ఐశ్వర్య రాయ్ సినీ రంగంలోకి అడుగుపెట్టింది. తమిళం, హిందీ సినిమాల్లో నటించి, తన అభినయ ప్రతిభను చాటుకుంది.
ఆమె నటించిన చాలా సినిమాలు బాక్సాఫీస్ వద్ద విజయవంతమయ్యాయి. దేవదాస్ చిత్రంలో ఐశ్వర్య రాయ్ పోషించిన పాత్ర ఆమెకు ఎంతో గుర్తింపు తెచ్చిపెట్టింది.జోధా అక్బర్ చిత్రంలో మొగల్ చక్రవర్తి అక్బర్ భార్య జోధాబాయి పాత్రను అద్భుతంగా పోషించింది. సల్మాన్ ఖాన్‌తో కలిసి నటించిన జై హో చిత్రం కూడా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఐశ్వర్య రాయ్ బాలీవుడ్ నటుడు అభిషేక్ బచ్చన్‌ను వివాహం చేసుకుంది. వీరికి ఆరాధ్య అనే కూతురు ఉంది. అయితే పెళ్లికి ముందు ఐశ్వర్య రాయ్ పలువురి హీరోయిన్లతో ఎఫైర్ సాగించిందనే విషయం తెలిసిందే.

వివేక్ ఒబెరాయ్‌తో పాటు, బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్‌తో ఐశ్వర్య రాయ్ ప్రేమాయణం సాగించింది. ఐశ్వర్య రాయ్ తన ఎఫైర్లను ఎప్పుడూ దాచి పెట్టాలని ప్రయత్నించలేదు. అయితే ఐశ్వర్య రాయ్ ఒకప్పుడు కుబేరుడు అయిన అనిల్ అంబానీ మధ్య సంబంధం గురించి అనేక పుకార్లు తెర మీదకు వచ్చాయి. ఐశ్వర్య రాయ్ అనిల్ అంబానీతో డేటింగ్ చేసిందంటూ అప్పట్లో బాలీవుడ్ మీడియా కోడై కూసింది. ఐశ్వర్య రాయ్ బచ్చన్, అనిల్ అంబానీల మధ్య సంబంధం ఉందనే విషయం అప్పట్లో సంచలనంగా మారింది.
దీనిపై మీడియా ఆమెను ప్రశ్నించగా, ఐశ్వర్య ఆగ్రహం వ్యక్తం చేశారు.నా పేరును పదే పదే ఎందుకు వాడుతున్నారో నాకు అర్థం కావడం లేదంటూ మీడియాపై అసహనం వ్యక్తం చేసింది. అనిల్ అంబానీని తాను తక్కువ సార్లు కలిశానని, అంతకు మించి తమ మధ్య ఎలాంటి బంధం లేదని చెప్పి ఐశ్వర్య క్లారిటీ ఇచ్చింది. అయితే అప్పటికే అనిల్ అంబానీ నటి టీనా మునిమ్‌ను పెళ్లాడారు.రిలయన్స్ కమ్యూనికేషన్స్‌లో ఓ వెలుగు వెలిగిన అనిల్ అంబానీ , ఆ తర్వాత దివాళా తీసే పరిస్థితికి చేరుకున్నారు. అన్న ముఖేశ్ అంబానీ కొడుకు పెళ్లిలో సాధారణ వ్యక్తిగా కనిపించి అనిల్ అంబానీ అందరికి షాకిచ్చారు.
-
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా" -
నరసింహ నాయుడు, ఘరానా మొగుడు.. ఈ రెండు ఇండస్ట్రీ హిట్లలో ఏది బెస్ట్? -
ఎవరీ మార్క్ కె రాబిన్.. ఎందుకు ఆయనకు అంత క్రేజ్ -
ఆ ఒక్క విషయంలో ఎన్టీఆర్‌నే బాలయ్య ఎదిరించారు: నారా బ్రాహ్మణి -
ఇండియన్ స్క్రీన్‌పై ఇప్పటివరకు రాని కథతో సినిమా..! -
ఉగాది నుంచి వృశ్చిక రాశి, తులారాశి వారి జాతక ఫలం -
నటుడిగా మహేష్ కుమారుడి విధ్వంసం.. వీడియో వైరల్..! -
T20 World Cup: చిత్తుగా ఓడిన కివీస్ పై అర్ధరాత్రి ఐసీసీ సంచలన ట్వీట్..! -
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
‘మన శంకర వరప్రసాద్ గారు’ ఫైనల్ కలెక్షన్స్.. అనుకున్నదొక్కటి.. -
రిటైర్మెంట్ పై సూర్య కుమార్ సంచలన ప్రకటన..!! -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు












Click it and Unblock the Notifications