లైంగిక వేధింపుల కేసులో 'స్క్విడ్ గేమ్' నటుడు అరెస్ట్..
చిత్ర పరిశ్రమలో లైంగిక వేధింపుల ఘటనలు ఇప్పటికే చాలా చోటుచేసుకున్నాయి. ఇప్పుడు తాజాగానే ఈ తరహా సంఘటన జరిగింది. 'స్క్విడ్ గేమ్' సిరీస్ నకు ప్రపంచవ్యాప్తంగా మంచి ఆదరణ లభించింది. నాలుగేళ్ల క్రితం విడుదలయ్యి ప్రపంచవ్యాప్తంగా విపరీతమైన పాపులారిటీ సంపాదించుకుంది. ఈ వెబ్ సిరీస్ లో కీలక పాత్రలో నటించిన ఒక నటుడుకి లైంగిక వేధింపుల ఆరోపణల కేసులో శిక్ష ఖరారు కావడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.
అయితే లైంగిక వేధింపుల కేసులో జైలుకి వెళ్లబోయేది మెయిన్ లీడ్ గా చేసిన నటుడు కాదులేండి. మరో ముఖ్య పాత్ర పోషించిన 80 ఏళ్ల ఓ యోంగ్ సు. ఈ వయసులోనూ ఆయన అద్భుతంగా నటించారని ప్రశంసలు వెల్లువెత్తాయి. కానీ ఇప్పుడు అనూహ్యంగా వేధింపుల కేసులో న్యాయస్థానం అతడికి జైలు శిక్ష విధించడం అందరికీ షాక్ ఇస్తుంది.

ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళ్తే.. దాదాపు 50 ఏళ్ల నుంచి సినిమా ఇండస్ట్రీలో రాణిస్తున్నారు ఓ యోంగ్ సు. అయితే కొంతకాలం క్రితం వేధింపులకు పాల్పడ్డాడని.. లైంగికంగా వేధించాడని ఆరోపిస్తూ ఓ జూనియర్ ఆర్టిస్ట్ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. అంతే కాకుండా ఘటన జరిగిన నాటి నుంచి తిరిగి పని చేసుకోవడానికి వెళ్లాలంటేనే భయంగా ఉందని వాపోయింది. అయితే కోర్టు విచారణ సమయంలో తాను చేసిన దానిలో ఏమాత్రం తప్పు లేదన్నట్లు ఓ యోంగ్ సు మాట్లాడటం.. పశ్చాత్తాపం వ్యక్తం చేయడానికి బదులు తనని తాను సమర్థించుకోవడంతో.. ఇరు వాదనలు విన్న న్యాయస్థానం సాక్ష్యాధారాలను పరిశీలించి అతడికి ఏడాది పాటు జైలు శిక్ష విధించింది.
స్క్విడ్ గేమ్ వెబ్ సిరీస్‌లో ప్లేయర్ 001గా ఓ యోంగ్ సు కనిపించాడు . మరోవైపు ఈ సిరీస్ కొనసాగింపుగా చిత్రాలు రానున్న తరుణంలో మళ్లీ ఆయనను ఈ సిరీస్ లోకి తీసుకోరని కూడా అంటున్నారు. యోంగ్ సు కారణంగా తమ సిరీస్ కు ఎలాంటి డ్యామేజ్ జరగకూడదని మేకర్స్ ఈ నిర్ణయం తీసుకోబోతున్నారని చర్చ నడుస్తోంది.
-
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్‌చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
సప్తగిరి ఎక్స్‌ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై -
ఉత్తర తెలంగాణా అభివృద్ధిలో గేమ్ ఛేంజర్ ఆ ఎయిర్పోర్ట్.. కేంద్రం మరో కీలక అడుగు! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
తండ్రి, తనయుడి స్థానాలు ఇవే- డీఎంకే తొలి జాబితా -
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి, ఆశ్లేష ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
H-1B Visa: హెచ్1బీ లాటరీ నోటీసుల విడుదల-స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి..! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
ఏప్రిల్ లో బ్యాంకులకు వరుస హాలిడేస్ - స్కూళ్లకు వేసవి సెలవులపై తాజా ఉత్తర్వులు..!! -
ఇరాన్‌కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
బంగారం ధరలు తలకిందులు












Click it and Unblock the Notifications