'అమ్మాయి అన్నాక మగాడికి పడాలి.. పడి తీరాల్సిందే'
టాలీవుడ్ యాంకర్స్ లో గ్లామర్ తో అందరి దృష్టిని ఆకర్షించే ముద్దుగుమ్మ స్రవంతి చొక్కారపు. తన అందం, చలాకీతనంతో ప్రేక్షకుల్ని అలరిస్తున్నారు. రియాల్టీ షోలు, బిగ్ బాస్ లో పాల్గొని మరింత పాపులర్ గా మారిందీ అమ్మడు. ఆమె ఎప్పటికప్పుడు షేర్ చేసే ఫోటోలు నెట్టింట వైరల్ అవుతుంటాయి. స్టైలిష్ అవుట్ ఫిట్స్, ట్రెండీ ఫ్యాషన్ తో ఆమె ఫోటో షూట్ ఉంటుంది. అయితే ప్రస్తుతం ఆమె 'హే బల్వంత్' అనే తెలుగు సినిమాలో నటిస్తున్నారు.
టాలీవుడ్ యంగ్ హీరో సుహాస్, శివానీ నగరం జంటగా నటించిన చిత్రం 'హే బల్వంత్'. ఈ మూవీకి గోపీ అచ్చర దర్శకత్వం వహించారు. ఈ సినిమా ఫిబ్రవరి 20న ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఈ మూవీలో టాలీవుడ్ యాంకర్ స్రవంతి చొక్కారపు నటిస్తున్నట్లు సమాచారం. ఈ మేరకు ఇటీవల ఈ మూవీ ప్రీ రీలీజ్ ఈవెంట్ లో యాంకర్ శ్రవంతి చొక్కారపు షాకింగ్ కామెంట్స్ చేశారు. గబ్బర్ సింగ్ మూవీలో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ డైలాగ్స్ ను స్టేజీపైనే చెప్పారు. ప్రస్తుతం ఆమె స్పీచ్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.

"ఒక అమ్మాయి వారానికి పడుద్ది.. ఒక అమ్మాయి నెలకి పడుద్ది.. ఒక అమ్మాయి సంవత్సరానికి పడుద్ది.. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే.. మనం నిజాయితీగా ట్రై చేస్తే.. మనం హార్ట్ ఫుల్ గా ట్రై చేస్తే.. మనం చేసే ఏ వర్క్ అయినా సరే.. ఒకరికి ఒక నెలలో సక్సెస్ రావచ్చు.. ఒకరికి ఒక సంవత్సరంలో సక్సెస్ రావచ్చు. ఒకరికి ఐదు సంవత్సరాల్లో సక్సెస్ రావచ్చు.
#SravanthiChokarapu:
— Movies4u Official (@Movies4u_Officl) February 17, 2026
"ఒక అమ్మాయి వారానికి పడుద్ది...
ఒక అమ్మాయి నెలకి పడుద్ది...
ఒక అమ్మాయి సంవత్సరానికి పడుద్ది...
ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే.."#PawanKalyan | #HeyBalwanth pic.twitter.com/jR2IPdtLL7
కానీ ఎన్ని సంవత్సరాలైనా సరే.. ఆ దేవుడి ఏదో ఒక అవకాశం కల్పిస్తాడు. అలా 15 సంవత్సరాల తర్వాత ఈ సినిమాతో నాకు ఇచ్చాడు. నేను చాలా హ్యాపీ" అని స్రవంతి చొక్కారపు స్టేజీపైన ఎమోషనల్ కామెంట్స్ చేశారు. దీంతో అక్కడున్నవాళ్లు చప్పట్లతో ఆమెను అభినందించారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.












Click it and Unblock the Notifications