ఓటీటీలోకి సూపర్ హిట్ మూవీ!

సూపర్ హిట్ కథలను ఎంచుకుని టాలీవుడ్ అభిమానులను అలరించడంలో యువహీరో శ్రీవిష్ణు ముందు వరుసలో ఉంటాడు. వైవిధ్యమైన స్టోరీలను ఎంచుకునే హీరో శ్రీవిష్ణు తాజాగా నటించిన క్రైమ్ థ్రిల్లర్ సినిమా 'మృత్యుంజయ'. హుస్సేన్ షా కిరణ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో శ్రీవిష్ణు గతంలో ఎన్నడూ చూడని కొత్త అవతారంలో కనిపించాడు. రెబా మోనికా జాన్ హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రం కమర్షియల్ హంగులకు దూరంగా ఓ పక్కా ఇన్వెస్టిగేటివ్ సస్పెన్స్ థ్రిల్లర్ గా రూపొందింది. ఈ సినిమాలోని ట్విస్టులు అభిమానులను సీట్ల అంచులపై కూర్చోపెట్టాయి. అలాంటి సినిమా థియేటర్లలో పరవాలేదనిపించినా.. బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో వసూళ్లు రాబట్టలేకపోయింది.

థియేటర్లలో ఎందుకు తగ్గింది?
థియేటర్లలో ఈ సినిమా విడుదలైనప్పుడు విమర్శకుల నుంచి కూడా ప్రశంసలను పొందింది. ఈ చిత్రాన్ని చూసిన ప్రేక్షకులు కూడా ట్విస్టులు మైండ్ బ్లోయింగ్ అంటూ కితాబిచ్చారు. కానీ ఇలాంటి సీరియస్ థ్రిల్లర్లను థియేటర్లకు వెళ్లి చూడటం కంటే.. ఇంట్లోనే ప్రశాంతంగా ఓటీటీలో చూడొచ్చని మెజారిటీ ప్రేక్షకులు భావించడంతో థియేటర్లలో వసూళ్లు తగ్గినట్లు తెలుస్తోంది. తాజాగా ఈ సినిమా ఓటీటీలో అలరించనున్నట్లు తెలుస్తోంది.

Sree Vishnu Crime Thriller Mrithyunjay OTT Release Date Out Streaming on Netflix from April 3

ఓటీటీ విడుదల తేదీ ఇదే..!
ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం.. "మృత్యుంజయ" చిత్రం డిజిటల్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ దక్కించుకుంది. ఈ చిత్రం ఏప్రిల్ 3, 2026 నుంచి స్ట్రీమింగ్ అయ్యే అవకాశం ఉంది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఈ సినిమా మల్టీ లాంగ్వేజెస్(తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ)లో అందుబాటులోకి రానుందని సమాచారం. ఇది హీరో శ్రీవిష్ణుకు పాన్-ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చే అవకాశం ఉంది.

సెకండ్ ఇన్నింగ్స్ మొదలవుతుందా?
ఇటీవల చాలా చిత్రాలు థియేటర్లలో అంతగా ఆడకపోయినా, ఓటీటీలోకి వచ్చాక సంచలనాలను సృష్టిస్తున్నాయి. మృత్యుంజయ సినిమా కూడా పక్కా డిజిటల్ అభిమానులకు నచ్చే కంటెంట్ కలిగి ఉండటంతో నెట్‌ఫ్లిక్స్‌లో దీనికి మంచి ఆదరణ లభిస్తుందని సినిమా బృందం ఆశిస్తోంది. థియేటర్లలో మిస్ అయిన గుర్తింపును ఈ సినిమా డిజిటల్ ప్లాట్‌ఫామ్ పై దక్కించుకుంటుందో లేదో వేచి చూడాల్సిందే.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+