ఆ హీరోకి లిప్ లాక్ ఇచ్చేసిన శ్రీలీల..?
తెలుగు ఇండస్ట్రీని హీరోయిన్ శ్రీలీల ఓ ఊపు ఊపింది. మరే హీరోయిన్‌కు సాధ్యం కానీ విధంగా వరుస సినిమాల్లో నటించి స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకుంది. తెలుగు ఇండస్ట్రీలో శ్రీలీలపేరు మొన్నటి వరకు మార్మోగిపోయింది. వరుస సినిమాలతో శ్రీలీల హల్ చల్ చేసింది. యంగ్ హీరోలతో పాటు, సూపర్ స్టార్ మహేష్ బాబు వంటి హీరోతో సైతం యాక్ట్ చేసింది ఈ అమ్మడు. అయితే గత కొంతకాలంగా శ్రీలీల హవా తగ్గిందనే చెప్పాలి. ఆమె నటించిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఫెయిల్ కావడంతో శ్రీలలకు ఆఫర్లు తగ్గాయి.
అయితే తెలుగులో అవకాశాలు తగ్గినప్పటికి, తమిళ, హిందీ భాషల్లో అమ్మడుకు వరుస అవకాశాలు దక్కుతున్నాయి. రీసెంట్‌గా తమిళ స్టార్ అజిత్ 'గుడ్ బ్యాడ్ అగ్లీ' మూవీలో కీలక పాత్రలో నటిస్తోంది. మాస్ రాజా రవితేజతో మాస్ జాతర సినిమా చేస్తుంది ఈ అమ్మడు. ఆ సినిమా తో పాటు పవర్ స్టార్ తో ఉస్తాద్ భగత్ సింగ్ కూడా సెట్స్ మీద ఉంది. ఈ మధ్యనే శివ కార్తికేయన్ సినిమాలో ఛాన్స్ అందుకుని కోలీవుడ్‌లోకి అడుగు పెడుతోంది.

ఇక ఈ ఏడాదే బాలీవుడ్ ఎంట్రీకి కూడా శ్రీలీల రెడీ అయిపోయింది. స్టార్ హీరో సైఫ్ అలీఖాన్ కొడుకు ఇబ్రహిం ఖాన్ ప్రస్తుతం 'దిలర్' మూవీ చేస్తున్నాడు. ఇందులో శ్రీలీలని హీరోయిన్‌గా తీసుకున్నారనే టాక్ వినిపిస్తోంది.దీంతో పాటు నాగ చైతన్య కొత్త సినిమాలో కూడా హీరోయిన్‌గా శ్రీలీలనే ఎంపిక చేశారని తెలుస్తోంది. ఈ రెండు సినిమాలు హిట్ అయితే శ్రీలీల పంట పండినట్లే. తాజాగా శ్రీలీల మరో బాలీవుడ్ సినిమా చేస్తోంది. కార్తీక్ ఆర్యన్ హీరోగా చేస్తోన్న కొత్త సినిమాలో శ్రీలీల హీరోయిన్‌గా చేస్తోంది.
దీనికి సంబంధించిన టీజర్‌ను చిత్ర యూనిట్ విడుదల చేశారు.ఈ వీడియోలో శ్రీలీల, కార్తీక్ ఆర్యన్ రొమాన్స్‌తో రెచ్చిపోయారు.ప్రేమలో గాఢతను చూపిస్తోన్నట్టుగా టీజర్‌గా ఉంది. ఇంకా చెప్పాలంటే కార్తీక్ ఆర్యన్‌కు శ్రీలీల లిప్ లాక్ ఇచ్చినట్టే కనిపిస్తోంది. సినిమా విడుదల అయితే కానీ శ్రీలీల లిప్ లాక్ ఇచ్చిందో లేదో క్లారిటీ రాదు. ప్రస్తుతం శ్రీలీల, కార్తీక్ ఆర్యన్ రొమాన్స్ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.












Click it and Unblock the Notifications