నందమూరి ఇంటి కోడలుగా శ్రీలీల..?

టాలీవుడ్ మోస్ట్ వాటెండ్ హీరోయిన్ అంటే అందరు ఠక్కన చెప్పే పేరు శ్రీలీల. ప్రస్తుతం అరడజనుకు పైగా ఆమె చేతితో సినిమాలు ఉన్నాయి. యంగ్ హీరోల నుంచి సీనియర్ హీరోల వరకు చాలా సినిమాలు ఆమె చేతిలో ఉన్నాయి. శ్రీలీల నటించిన సినిమాలు నెలకు ఒకటి విడుదల అవుతుందంటే ఆమె ఎన్ని సినిమాలు చేస్తుందో అర్థం చేసుకోవచ్చు.

భగవత్ కేసరి, ఆది కేశవ, ఉస్తాద్ భగత్ సింగ్, గుంటూరు కారం వంటి క్రేజీ ప్రాజెక్ట్స్ శ్రీలీల చేతిలో ఉన్నాయి. ప్రస్తుతానికైతే టాలీవుడ్‌లో నెంబర్ స్థానం శ్రీలీలదే. ఇదిలా ఉంటే శ్రీలీలకు సంబంధించిన వార్త ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. నందమూరి బాలకృష్ణ కుమారుడు మోక్షజ్ఞతో శ్రీలీలకు పెళ్లి ఫిక్స్ అంటూ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది.

sreeleela latest movies

భగవత్ కేసరి సినిమాలో బాలకృష్ణతో కలిసి శ్రీలీల నటించింది. ఈ సినిమా దసరాకు విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. అయితే ఈ సినిమా సమయంలో బాలయ్యకు శ్రీలీల బాగా దగ్గరైపోయింది. బాలయ్య ఇంటి సభ్యురాలుగా శ్రీలీల మారిపోయింది. భగవత్ కేసరి సినిమా టీజర్ విడుదల సమయంలో కూడా బాలకృష్ణతో తనకున్న అనుబంధాన్ని శ్రీలీల గుర్తు చేసుకున్నారు.

 sreeleela with balakrishna

తనకు తండ్రి ప్రేమ తేలియదని..బాలకృష్ణగారితో ఆ కోరిక కూడా తీరిపోయిందని శ్రీలీల ఆ వేదిక సాక్షిగా చెప్పడం జరిగింది. అటు బాలకృష్ణ కూడా శ్రీలీలపై ప్రత్యేక అనుబంధాన్ని పెంచుకున్నట్టే కనిపిస్తుంది. ఒకటి రెండు సందర్భాల్లో బాలకృష్ణ ఇంటికి శ్రీలీల వెళ్ళడం జరిగింది. ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలకు కూడా శ్రీలీల ప్రత్యేకంగా హాజరైంది. ఆ సమయంలోనే శ్రీలీలతో మోక్షజ్ఞ కలిసి కనిపించారు.

sreeleela and nandamuri mokshagna

దాంతో కొత్త ఊహాగానాలకు తెరలేపినట్టైంది. . శ్రీలీలను నందమూరి ఇంటి కోడలుగా చేసుకోవడానికి బాలకృష్ణ రెడీ అవుతున్నారనే వార్త తెర మీదకు వచ్చింది. భగవత్ కేసరి సినిమా టీజర్ విడుదల సమయంలో బాలకృష్ణ మాట్లాడుతూ..శ్రీలీలతో సినిమా చేస్తున్నావ్ .. నీకు గ్రౌండ్ ఫ్లోర్ బలిసిందా డాడీ అంటూ మోక్షజ్ఞ తనకు వార్నింగ్ ఇచ్చాడని. . శ్రీలీలతో యంగ్ హీరో నేను నటిస్తాను. నువ్వు ఎలా చేస్తావు అన్నాడంటూ బాలయ్య చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి.

sreeleela marriage viral

భగవత్ కేసరి షూటింగ్ సమయంలో కూడా మోక్షజ్ఞ సినిమా లోకేషన్‌కు వెళ్లిన ఫొటోలు సోషల్ మీడియాలో దర్శనం ఇచ్చాయి. ఈ క్రమంలోనే మోక్షజ్ఞ , శ్రీలీల పెళ్లి తెర మీదకు వచ్చింది. అటు బాలయ్యకు కూడా శ్రీలీల అంటే మంచి అభిప్రాయమే ఉంది. దీంతో శ్రీలీల నందమూరి ఇంటి కోడలు అయ్యే అవకాశాలు కొట్టి పారేయలేం అని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. మరి మోక్షజ్ఞతో పెళ్లిపై శ్రీలీల ఎలా స్పందిస్తుందో చూడాలి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+