ఇండస్ట్రీ పెద్ద ఇంటి కోడలుగా శ్రీలీల..జాతకాలు చూపిస్తోన్న తల్లి
టాలీవుడ్ మోస్ట్ వాటెండ్ హీరోయిన్ అంటే అందరు ఠక్కన చెప్పే పేరు శ్రీలీల. ప్రస్తుతం అరడజనుకుపైగా సినిమాలు ఆమె చేతిలో ఉన్నాయి. యంగ్ హీరోల నుంచి సీనియర్ హీరోల వరకు చాలా సినిమాలు శ్రీలీల చేతిలో ఉన్నాయి. శ్రీలీల నటించిన సినిమాలు నెలకు ఒకటి విడుదల అవుతున్నాయంటే ఆమె ఎన్ని సినిమాల్లో నటిస్తుందో అర్థం చేసుకోవచ్చు.
శ్రీకాంత్ తనయుడు రోషన్ పెళ్లి సందd సినిమాతో హీరోయిన్‌గా శ్రీలీల పరిచియం అయింది. సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని నమోదు చేసింది. ఈ సినిమా తరువాత శ్రీలీల హీరో రవితేజతో జోడీగా ధమాకా సినిమాలో నటించింది. ఈ సినిమా 100 కోట్లు కలెక్ట్ చేయడంతో.. దర్శక-నిర్మాతలందరూ శ్రీలీల వెంట పడ్డారు.భగవత్ కేసరి, ఆది కేశవ, ఉస్తాద్ భగత్ సింగ్, స్కంద, గుంటూరు కారం వంటి క్రేజీ ప్రాజెక్ట్స్ శ్రీలీల ఆ మధ్య హల్ చేసింది.ప్రస్తుతానికైతే టాలీవుడ్‌లో నెంబర్ స్థానం శ్రీలీలదే.

అయితే శ్రీలీల పెళ్లికి సంబంధించి రోజుకో వార్త బయటకు వస్తుంది. భగవత్ కేసరి సినిమాలో బాలకృష్ణతో కలిసి శ్రీలీల నటించింది. ఈ సినిమా సమయంలో బాలయ్యకు శ్రీలీల బాగా దగ్గరైంది. బాలయ్య ఇంటి సభ్యురాలుగా శ్రీలీల మారిపోయింది. సినిమా షూటింగ్ సమయంలో బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞతో శ్రీలీల దిగిన ఫొటోలు బయటకు రావడంతో .. మోక్షజ్ఞ శ్రీలీలను పెళ్లి చేసుకోబోతున్నాడంటూ సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్ అయింది.
తాజాగా శ్రీలీల తల్లి ఆమె జాతకాన్ని ఓ ప్రముఖ జ్యోతిష్యుడుకు చూపించగా, మీ అమ్మాయి ఓ బడా ఫ్యామిలీ ఇంటికి కోడలుగా వెళ్లబోతుందంటూ ఆ జ్యోతిష్యుడు చెప్పినట్టు కన్నడ మీడియాలో ఓ వార్త వైరల్ అవుతుంది. దీంతో శ్రీలీల ఎవరి ఇంటికి కోడలుగా వెళ్తుందా అని నెటిజన్లు అతృతుగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే శ్రీలీల తాను ఓ వ్యక్తితో ప్రేమలో ఉన్నానని ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే.












Click it and Unblock the Notifications