ఆ తెలుగు హీరో సినిమాలో నటించి తప్పు చేశాను..ఇంకెప్పుడు చేయను

తెలుగు ఇండస్ట్రీని హీరోయిన్ శ్రీలీల ఓ ఊపు ఊపింది. మరే హీరోయిన్‌కు సాధ్యం కానీ విధంగా వరుస సినిమాల్లో నటించి స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకుంది. తెలుగు ఇండస్ట్రీలో శ్రీలీలపేరు మొన్నటి వరకు మార్మోగిపోయింది. వరుస సినిమాలతో శ్రీలీల హల్ చల్ చేసింది. యంగ్ హీరోలతో పాటు, సూపర్ స్టార్ మహేష్ బాబు వంటి హీరోతో సైతం యాక్ట్ చేసింది ఈ అమ్మడు. అయితే గత కొంతకాలంగా శ్రీలీల హవా తగ్గిందనే చెప్పాలి. ఆమె నటించిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఫెయిల్ కావడంతో శ్రీలలకు ఆఫర్లు తగ్గాయి.

అయితే తెలుగులో అవకాశాలు తగ్గినప్పటికీ, తమిళ, హిందీ భాషల్లో అమ్మడుకు వరుస అవకాశాలు దక్కుతున్నాయి. ఇది ఇలా ఉండగానే ఇప్పుడు బాలీవుడ్ ఎంట్రీకి కూడా శ్రీలీల రెడీ అయిపోయింది. స్టార్ హీరో సైఫ్ అలీఖాన్ కొడుకు ఇబ్రహిం ఖాన్ ప్రస్తుతం 'దిలర్' మూవీ చేస్తున్నాడు. ఇందులో శ్రీలీలని హీరోయిన్‌గా తీసుకున్నారనే టాక్ వినిపిస్తోంది. ఈ రెండు సినిమాలు హిట్ అయితే శ్రీలీల పంట పండినట్లే.

Sreeleela Puts an End to Item Songs I Don t Want to Be Seen Only as a Dancer

ఇదిలా ఉంటే శ్రీలీల ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 సినిమాలో ఐటం సాంగ్‌లో నటించింది. కిస్సిక్ అంటూ వచ్చిన సాంగ్‌లో శ్రీలీల తనదైన డ్యాన్స్‌తో అల్లు అర్జున్‌కు గట్టి పోటినిచ్చింది.ఈ సాంగ్ సినిమా హిట్‌కు ఎంతగానో తోడ్పడింది. అయితే తాజాగా ఈ సాంగ్‌లో నటించండపై షాకింగ్ కామెంట్స్ చేసింది.

శ్రీలీల మాట్లాడుతూ... "పుష్ప" లాంటి పెద్ద సినిమా నా కెరీర్‌పై భారీ ప్రభావం చూపింది. అలాంటి ప్రపంచ రికార్డులు సృష్టించిన చిత్రంలో భాగం కావడం నాకు నిజంగా గర్వకారణం. అయితే, ఈ అనుభవం తర్వాత నేను ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకున్నాను. ఇకపై ఏ సినిమాలోనూ ఐటమ్ సాంగ్స్ చేయకూడదని నిర్ణయించుకున్నాను. మళ్లీ ఐటమ్ సాంగ్ చేసి తప్పు చేయాలనుకోవడం లేదు.

ఇండస్ట్రీలో చాలా మంది నన్ను 'బెస్ట్ డ్యాన్సర్‌'గా మాత్రమే చూస్తున్నారు. నా నటన సామర్థ్యం అందరికీ తెలిసినప్పటికీ, నేను కేవలం డ్యాన్సర్‌నే అన్నట్టుగా గుర్తిస్తున్నారు. కానీ నేను కేవలం డ్యాన్సర్‌ను మాత్రమే కాదు, మంచి నటిని కూడా. నా పర్ఫామెన్స్‌కు కూడా ప్రాధాన్యత ఇవ్వాలని కోరుకుంటున్నాను.ఐటమ్ సాంగ్స్ వల్ల తాను కేవలం డ్యాన్సర్‌గా ముద్ర పడిపోతుందని భావించిన శ్రీలీల, తనలోని నటన ప్రతిభను నిరూపించుకునేందుకు ఇకపై ప్యూర్ నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలను మాత్రమే ఎంచుకోవాలని దృఢంగా నిర్ణయించుకున్నట్లు తెలిపారు. భారీ రెమ్యూనిరేషన్ ఆఫర్ చేయడంతోనే ఈ స్పెషల్ సాంగ్‌లో శ్రీలీల నటించిందని తెలుస్తోంది. పుష్ప 2 సినిమాలో ఐటం సాంగ్‌గానూ శ్రీలీల రూ. 2 కోట్లు తీసుకుందని సమాచారం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+