స్టార్ హీరో కొడుకుతో ప్రేమలో పడ్డ శ్రీలీల..? ఫొటో షేర్ చేసేసిందిగా..!
తెలుగు ఇండస్ట్రీని హీరోయిన్ శ్రీలీల ఓ ఊపు ఊపింది. మరే హీరోయిన్‌కు సాధ్యం కానీ విధంగా వరుస సినిమాల్లో నటించి స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకుంది. తెలుగు ఇండస్ట్రీలో శ్రీలీలపేరు మొన్నటి వరకు మార్మోగిపోయింది. వరుస సినిమాలతో శ్రీలీల హల్ చల్ చేసింది. యంగ్ హీరోలతో పాటు, సూపర్ స్టార్ మహేష్ బాబు వంటి హీరోతో సైతం యాక్ట్ చేసింది ఈ అమ్మడు. అయితే గత కొంతకాలంగా శ్రీలీల హవా తగ్గిందనే చెప్పాలి. ఆమె నటించిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఫెయిల్ కావడంతో శ్రీలలకు ఆఫర్లు తగ్గాయి.
అయితే తెలుగులో అవకాశాలు తగ్గినప్పటికి, తమిళ, హిందీ భాషల్లో అమ్మడుకు వరుస అవకాశాలు దక్కుతున్నాయి. ఇది ఇలా ఉండగానే ఇప్పుడు బాలీవుడ్ ఎంట్రీకి కూడా శ్రీలీల రెడీ అయిపోయింది. స్టార్ హీరో సైఫ్ అలీఖాన్ కొడుకు ఇబ్రహిం ఖాన్ ప్రస్తుతం 'దిలర్' మూవీ చేస్తున్నాడు. ఇందులో శ్రీలీలని హీరోయిన్‌గా తీసుకున్నారు.బాలీవుడ్ యంగ్ హీరో కార్తీక్ ఆర్యన్‌తో శ్రీలీల ఓ సినిమా చేస్తోంది. ఇటీవలే ఈ సినిమా టీజర్ విడుదలైంది. ఈ టీజర్‌లో కార్తీక్ ఆర్యన్‌తో శ్రీలీల లిప్ లాక్ ఇచ్చినట్టు కనిపిస్తోంది. ఈ రెండు సినిమాలు హిట్ అయితే శ్రీలీల పంట పండినట్లే.

ఇదిలా ఉంటే శ్రీలీలకు సంబంధించిన ఓ వార్త నెట్టింట చక్కర్లు కొడుతోంది. శ్రీలీల బాలీవుడ్ హీరోతో ప్రేమలో ఉన్నట్టు అక్కడి మీడియా కోడై కూస్తోంది. సైఫ్ అలీఖాన్ కొడుకు ఇబ్రహిం ఖాన్‌తో శ్రీలీల డేటింగ్ చేస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఇబ్రహీం అలీ ఖాన్ పుట్టినరోజు సందర్భంగా ఆయనతో కలిసి ఉన్న ఫొటో షేర్ చేస్తూ.. ''హ్యాపీ బర్త్ డే ఇగ్గీ. నువ్వు ప్రపంచానికి ఏం చూపించాలనుకుంటున్నావో దాని గురించి వెయిట్ చేయలేకపోతున్నాను.. ఇది జస్ట్ బిగినింగ్ మాత్రమే అంటూ హార్ట్స్ సింబల్‌ను కూడా షేర్ చేసింది. ఆ మధ్య ఇబ్రహీం అలీ ఖాన్‌తో కలిసి శ్రీలీల పబ్‌లో కూడా దర్శనం ఇచ్చారు.దీంతో శ్రీలీల అతనితో ప్రేమలో ఉందని అంతా ఫిక్స్ అయిపోయారు.ఇదిలా ఉంటే గతంలో శ్రీలీల ఓ ఇంటర్య్వూలో మాట్లాడుతూ. ఎవరితోనైనా ప్రేమలో ఉన్నారా అని అడిగిన ప్రశ్నకు శ్రీలీల అవుననే సమాధానం ఇచ్చింది. దీంతో ఈ అమ్మడు బాలీవుడ్ హీరో ఇబ్రహిం ఖాన్‌తోప్రేమలో ఉందని గుసగుసలు వినిపిస్తున్నాయి.మరి దీనిపై శ్రీలీల ఎలా స్పందిస్తుందో చూడాలి.












Click it and Unblock the Notifications