టీజర్ కే కడుపుబ్బా నవ్వించాడు.. ఇక సినిమా ఎలా ఉంటుందో..!
టాలీవుడ్ యంగ్ హీరో శ్రీవిష్ణు హిట్, ప్లాఫ్ తేడా లేకుండా సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నాడు. గతేడాది సింగిల్ సినిమాతో అలరించిన శ్రీ విష్ణు.. ఇప్పుడు మరోసారి ప్రేక్షకుల్ని కడుపుబ్బా నవ్వించేందుకు సిద్ధమయ్యాడు. శ్రీ విష్ణు హీరోగా నటించిన 'విష్ణు విన్యాసం' మూవీ టీజర్ తాజాగా రిలీజైంది. ఈ టీజర్ సినీ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. వినోదమే ప్రధానంగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు యదునాథ్ మారుతీ రావు దర్శకత్వం వహిస్తున్నారు.
ఎప్పటికప్పుడు విభిన్నమైన కథాంశాలతో యూత్ లో తనకంటూ సెపరేట్ ఫ్యాన్స్ ను సంపాదించుకున్నాడు యంగ్ హీరో శ్రీ విష్ణు. అలా వరుసగా హిట్ సినిమాలు చేస్తూ దూసుకెళ్తున్నాడు. గతేడాది సింగిల్ మూవీతో హిట్ కొట్టిన శ్రీ విష్ణు.. ఈ ఏడాది విష్ణు విన్యాసం మూవీతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఈ మేరకు ఈ మూవీ టీజర్ తాజాగా విడుదలైంది. టీజర్ తోనే కడుపుబ్బా నవ్వించాడు శ్రీ విష్ణు. ఇక ఈ సినిమాలోని ఒక పాట ఇప్పటికే బాగా వైరల్ అయింది. తాజాగా టీజర్ కు కూడా సూపర్ రెస్పాన్స్ రావడంతో మూవీపై అంచనాలు ఒక్కసారిగా పెరిగిపోయాయి.

'విష్ణు విన్యాసం' మూవీ టీజర్ చూస్తే.. జాతకాలు, వాస్తు వంటి వాటిపై అతిగా ఆసక్తి చూపే యువకుడిగా శ్రీ విష్ణు కనిపించనున్నట్లు తెలుస్తోంది. డబ్బే లోకంగా భావించే తండ్రికి, జాతకాలని నమ్మే కొడుకుకి మధ్య జరిగే సంఘర్షణ కథకు మెయిన్ ఎట్రాక్షన్ గా నిలవనుందని టాక్. ఇక ఈ మూవీ ఫిబ్రవరి 28న రిలీజ్ కానుంది. ఈ మూవీతో శ్రీవిష్ణు తన కామెడీ టైమింగ్ తో మరోసారి ఆడియన్స్ ను కడుపుబ్బా నవ్వించడానికి రెడీ అయినట్టు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications