" పెళ్లాన్ని అడిగినట్టే అడుగుతున్నారు"
టాలీవుడ్ కిసిక్ బ్యూటీ శ్రీలీల తన అందంతోనే కాదు.. నటన, డ్యాన్స్ తోనూ అలరిస్తూ వస్తుంది. హీరోలకు ధీటుగా స్టెప్పులు వేస్తూ అందరినీ మెప్పిస్తోంది. 2019లో కిస్ మూవీతో కన్నడ సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయిన శ్రీలీల.. రాఘవేంద్రరావు డైరెక్షన్ లో వచ్చిన పెళ్లి సందడి చిత్రంతో తెలుగు తెరకు పరిచయం అయింది. ఆ తర్వాత ఆ తర్వాత 'ధమాకా', 'భగవంత్ కేసరి', 'గుంటూరు కారం' సినిమాల్లో నటించి మంచి గుర్తింపు పొందింది. ఆ తర్వాత 'పుష్ప 2: ది రూల్' మూవీలో కిస్ కిస్సిక్ అంటూ ఐటెం సాంగ్ తో అలరించింది.
ఇక ప్రస్తుతం శ్రీలీల.. పవర్ స్టార్ పవన్ కల్యాణ్, హరీష్ శంకర్ కాంబోలో వస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ మూవీలో నటిస్తోంది. ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా మార్చి 26 న గ్రాండ్ గా విడుదల కానుంది. అయితే శ్రీలీలకు సంబంధించిన ఓ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఇటీవల ఓ కాలేజీ ఫంక్షన్ లో పాల్గొన్న శ్రీలీల.. కాలేజీ కుర్రాళ్లతో చేస్తున్న కామెడీ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

పల్నాడు జిల్లాలోని నరసరావుపేట ఇంజనీరింగ్ కాలేజీలో ఇటీవల నటి శ్రీలీల సందడి చేశారు. ఈ కాలేజీలో నిర్వహించిన జూబిలేషన్ ఫెస్ట్ లో పాల్గొంది. తన స్పీచ్ తో కాలేజీ కుర్రాళ్లలో జోష్ నింపింది. ఎప్పుడో చిన్నప్పుడు నరసరావుపేట వచ్చానని, కాలేజ్ ఫెస్టులో పాల్గొనడం ఆనందంగా ఉందని శ్రీలీల చెప్పుకొచ్చింది. స్టూడెంట్స్ చదువుపై దృష్టి పెట్టాలని చెప్పింది. మిమ్మల్ని చూసిన జోష్ లో అరచి అరచి గొంతు పోయిందని తెలిపింది.
భార్యను అడిగినట్టుగా అడుగుతున్నారు
— Milagro Movies (@MilagroMovies) March 2, 2026
:- Actress #Sreeleela pic.twitter.com/OEX6arNowt
అయితే డాన్స్ చేయాలని కాలేజీ కుర్రాళ్లు శ్రీలీలను అడిగారు. దాంతో ఆమె..'నిజంగా పెళ్ళాన్ని అడిగినట్లు అడిగారు.. డ్యాన్స్ చేద్దాం.. కమాన్' అని హుషారెత్తేలా మాట్లాడారు. దాంతో అక్కడున్న స్టూడెంట్స్ చప్పట్లు కొట్టారు. ఈ వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఈ వీడియోపై నెటిజన్లు పలు రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.
-
పెద్ది సినిమాలో పిచ్చెక్కించే ట్విస్ట్ ఇదే.. ఒక్కరు కాదు ఇద్దరు ?? -
"దానికోసం రోజూ ఫోర్స్ చేయలేను.. అందుకే విడిగా ఉంటున్నాం".. భర్తపై ఓపెన్ అయిన హీరోయిన్ -
రామ్ చరణ్ బర్త్డే గిఫ్ట్ మామూలుగా లేదుగా! -
‘ధురంధర్2’ హిట్ అయినా.. రాబోయే బాక్సాఫీస్ తుఫానులన్నీ తెలుగు సినిమాలవే -
రామ్ చరణ్ బర్త్ డే- మెగాస్టార్ వెరీ యూనిక్ సెలబ్రేషన్స్ -
అందరి ముందు ఆమె కాళ్లు పట్టుకున్న బాలయ్య.. వీడియో వైరల్ !! -
వాళ్లను వదలొద్దు- రఘురామ, పవన్ కళ్యాణ్ డిమాండ్..! -
‘ధురంధర్2’ దెబ్బకు ‘పుష్ప2’ రికార్డులు గల్లంతు -
వెంకీ- కల్యాణ్ రామ్- అనిల్ రావిపూడి: ఇంకో బ్లాక్ బస్టర్ రెడీ -
హనీమూన్ లో కొత్త జంట, ప్రైవేట్ రిసార్ట్లో ఆనంద క్షణాలు -
శ్రీరాముడిగా మెప్పించిన తెలుగు హీరోలు వీళ్ళే..? -
నందమూరి బాలకృష్ణకు లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు.. జై బాలయ్య !!










Click it and Unblock the Notifications