మళ్లీ స్క్రీన్ షేర్ చేసుకోబోతున్న స్టార్ బ్యూటీస్.. కానీ ఆ హీరోతో !!
తెలుగుచిత్ర పరిశ్రమలో వరుస సినిమాలతో దూసుకుపోతున్న హీరోయిన్స్ అంటే ఠక్కున గుర్తొచ్చే వారిలో శ్రీలీల, మీనాక్షీ చౌదరి ఉంటారు. ప్రస్తుతం ఫుల్ జోష్ లో దూసుకుపోతున్న ఈ యంగ్ బ్యూటీలు టాప్ స్టార్స్ గా రాణిస్తున్నారు. గమనార్హం ఏమిటంటే, శ్రీలీల - మీనాక్షి చౌదరి ఇంతకు ముందు మహేష్ బాబు - త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వచ్చిన 'గుంటూరు కారం' సినిమాలో కలిసి నటించారు. అప్పట్లో శ్రీలీల మెయిన్ హీరోయిన్ కాగా, మీనాక్షికి పరిమిత పాత్ర మాత్రమే దక్కింది. అయితే ఇప్పుడు వీరిద్దరూ మళ్లీ స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నట్టు తెలుస్తోంది.
ఏ మూవీలో అంటే..
తమిళ చిత్ర పరిశ్రమలో హాట్ టాపిక్ గా మారిన దర్శకుడు, హీరోగా ప్రదీప్ రంగనాథన్ నిలుస్తున్నారు. అటు డైరెక్టర్ గానే సక్సెస్ లు అందుకొని.. ప్రస్తుతం హీరోగా బిజీగా ఉన్నారు. ఆయన దర్శకుడిగా, హీరోగా వచ్చిన "లవ్ టుడే" సినిమాతో స్టార్‌డమ్ అందుకున్నారు. ప్రస్తుతం వరుస విజయాలతో యూత్ ఐకాన్‌గా మారిపోయాడు. రీసెంట్ గానే "డ్రాగన్" సినిమాతో హిట్ కొట్టిన ఈ హీరో.. ప్రస్తుతం ఎల్ఐసీ అనే మరో మూవీలో బిజీగా ఉన్నారు. ఇప్పుడు ప్రదీప్ ప్రేక్షకులను మరోసారి ఆశ్చర్యపరిచేందుకు ఇంట్రెస్టింగ్ సైన్స్ ఫిక్షన్ కథతో ముందుకు రాబోతున్నాడనే వార్త సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

ప్రదీప్ రంగనాథన్ స్వయంగా దర్శకత్వం వహిస్తూ హీరోగా కూడా నటించబోతున్నాడని అంటున్నారు. ఆ విషయాన్ని గతంలో ఓ ఇంటర్వ్యూలో కూడా ఆయన వెల్లడించిన విషయం తెలిసిందే. ఈ చిత్రానికి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ ఇప్పటికే పూర్తయ్యిందని టాక్ వినిపిస్తుంది. షూటింగ్‌ను మార్చి నెలలో ప్రారంభించేందుకు యూనిట్ సన్నాహాలు చేస్తోంది. ఈ ప్రాజెక్ట్‌ను AGS ఎంటర్‌టైన్‌మెంట్ నిర్మించనుండగా.. ఇది ప్రదీప్‌తో ఆ సంస్థకు మూడో సినిమా కావడం విశేషం.
టాక్ ప్రకారం ఈ సినిమా రూ.150-180 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కనుంది. ఇదే నిజమైతే... ఇది ప్రదీప్ కెరీర్‌లోనే అత్యంత భారీ స్కేల్ ప్రాజెక్ట్ అవుతుంది. మేకర్స్ ఈ సినిమాను 2026లో గ్రాండ్‌గా రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. దాంతో టాలీవుడ్ యూత్‌లో క్రేజ్ ఉన్న శ్రీలీల, మీనాక్షి చౌదరి ఈ చిత్రంలో ప్రదీప్ సరసన నటించనున్నారని ఇండస్ట్రీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ స్టార్ హీరోయిన్స్ ఇద్దరూ మరోసారి కలిసి నటిస్తుండడం పట్ల హాట్ బజ్ నెలకొంది.
-
శర్వానంద్ 'బైకర్' ఫస్ట్ రివ్యూ.. దేశంలోనే తొలి ప్రయత్నం.. -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
దయచేసి నన్ను సినిమాల్లో పెట్టుకోండి: రాజశేఖర్ రిక్వెస్ట్ -
"మొన్న చెప్పి హిట్టు కొట్టా.. మళ్లీ చెప్తున్నా బంపర్ బ్లాక్ బస్టర్" -
'బైకర్' ట్రైలర్ రిలీజ్.. శర్వానంద్ ఈసారి హిట్ కొట్టేశాడోచ్..! -
తెలంగాణ గద్దర్ అవార్డుల్లో చిన్న సినిమా హవా! -
తమిళ సాంగ్‌లో ఎనర్జిటిక్ డ్యాన్స్‌తో అదరగొట్టిన రోజా! వీడియో -
స్టార్ హీరోలున్నా.. కేవలం ఈ విలన్లవల్లే బ్లాక్ బస్టర్ అయిన సినిమాలు -
తెలుగులో 100 రోజులు ఆడిన సినిమాల్లో ఈ హీరోదే రికార్డు -
బన్నీ మూవీలో ఐదుగురు భామలా? అట్లీ స్కెచ్ మామూలుగా లేదుగా! -
హిందీ స్టార్ హీరోల వేధింపుల వల్లే డైరెక్టర్లకు కష్టాలు..












Click it and Unblock the Notifications