గురూజీ చేతిలో పడ్డ మరో హీరోయిన్.. ఇక జాతకం మారిపోయినట్టే
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ గురించి తెలుగు ప్రేక్షకులకు కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. రచయితగా కెరీర్ మొదలుపెట్టిన త్రివిక్రమ్..ఆ తర్వాత దర్శకుడిగా అవతారం ఎత్తారు. తీసింది తక్కువ సినిమాలే అయినప్పటికీ, తనకంటూ ప్రత్యేక గుర్తింపు దక్కించుకున్నారాయన. మహేష్ బాబు, పవన్ కల్యాణ్, ఎన్టీఆర్, అల్లు అర్జున్ వంటి స్టార్ హీరోలతో సినిమాలు చేసి , స్టార్ దర్శకుల లిస్ట్‌లో చేరారు. ఆయన సినిమాల్లో డైలాగులకు ఎంతటి ప్రాధాన్యత ఉంటుందో చెప్పాల్సిన పని లేదు. త్రివిక్రమ్ డైలాగులు ఎంత పవర్‌ఫుల్‌గా ఉంటాయో.. ఆయన సినిమాల్లో హీరోయిన్లు అంత కంటే అందంగా ఉంటారు. త్రివిక్రమ్ సినిమాల్లో హీరోయిన్‌గా ఉన్నారంటే ..వారిలో ఏదో స్పెషల్ టాలెంట్ ఉందని అర్థం.
శ్రియ, త్రిష, ఇలియానా, సమంత, పూజా హెగ్డే వంటి హీరోయిన్లతో ఆయన పని చేశారు. వీరంతా కూడా త్రివిక్రమ్ సినిమాల తర్వాత మరింత గుర్తింపు తెచ్చుకున్న వారే. సమంతకు త్రివిక్రమ్ అత్తారింటికి దారేది ,సన్ ఆఫ్ సత్యమూర్తి ,అ ఆ (A Aa) , మూడు సినిమాల్లో అవకాశం ఇవ్వగా, అరవింద సమేత వీర రాఘవ, అల వైకుంఠపురములో వంటి సినిమాల్లో పూజా హెగ్డేకు ఛాన్స్ ఇచ్చారు. ఇలా త్రివిక్రమ్ సినిమాల్లో హీరోయిన్‌లకు ప్రత్యేక గుర్తింపు ఉంటుంది.

త్రివిక్రమ్ ప్రస్తుతం సీనియర్ హీరో వెంకటేష్‌తో ఓ సినిమా చేయడానికి రెడీ అవుతున్నారు. దీనిలో భాగంగానే ఈ సినిమాలో హీరోయిన్‌ను ఎంపిక చేశారు. ఆ హీరోయిన్ మరెవరో కాదు.. శ్రీనిధి శెట్టి. 'కేజీఎఫ్', 'హిట్-3','తెలుసు కదా' వంటి సినిమాల్లో నటించి ఫుల్ జోష్‌లో ఉంది శ్రీనిధి శెట్టి. తాజాగా వెంకటేష్‌కు జోడిగా శ్రీనిధి శెట్టిని త్రివిక్రమ్ ఎంపిక చేశారు. శ్రీనిధి శెట్టి పుట్టిన రోజు సందర్భంగా వెంకటేష్ సినిమాలో ఆమె నటిస్తున్నట్టుగా ఓ పోస్టర్‌ను రిలీజ్ చేశారు చిత్ర యూనిట్.
త్రివిక్రమ్ శ్రీనిధి శెట్టిని సెలెక్ట్ చేసుకోవడంపై నెటిజన్లు తమదైనశైలిలో స్పందిస్తున్నారు.హీరోయిన్లను సెలెక్ట్ చేయాలంటే గురూజీ తర్వాతే అంటూ కొందరు కామెంట్ చేయగా, గురూజీ చేతిలో పడ్డ మరో హీరోయిన్.. ఇక జాతకం మారిపోయినట్టే అంటూ మరి కొందరు నెటిజన్లు రియాక్ట్ అవుతున్నారు.మరి శ్రీనిధి శెట్టికి గురూజీ ఎలాంటి బ్రేక్ ఇస్తారో చూడాలి. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది.












Click it and Unblock the Notifications