భార్యకు మర్చిపోలేని బర్త్ డే గిఫ్ట్ ఇచ్చిన స్టార్ హీరో..
కన్నడ స్టార్ హీరో యష్.. కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ చిత్రంలో ఆయన నటన నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి. ప్రస్తుతం ఆయన గీతు మోహన్‌దాస్ దర్శకత్వంలో 'టాక్సిక్' మూవీలో నటిస్తున్నారు. అలానే బాలీవుడ్‌లో నితీశ్ తివారీ తెరకెక్కిస్తున్న రామాయణంలో రావణుడి పాత్రలో నటిస్తున్నారు. అయితే యష్ నటి రాధిక పండిట్‌ను 2016లో పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే.
రీసెంట్ గా మార్చి 7న రాధిక బర్త్ డే జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పుట్టినరోజు వేడుకల్లో యష్ ఆమెకు మర్చిపోలేని సర్‌ప్రైజ్ ఇచ్చినట్టు తెలుస్తోంది. పార్టీలో ఆమె కోసం యష్ ఒక రొమాంటిక్ సాంగ్‌ను పాడినట్టు సోషల్ మీడియా వేదికగా ఆమె పోస్ట్ చేశారు. 1981లో వచ్చిన కన్నడ మూవీలోని పాటను పాడినట్టు ఆ వీడియోలో కనబడుతోంది. భార్య కోసం అలా పాడడం సో స్వీట్ అంటూ యష్ ను తెగ పొగిడేస్తున్నారు అభిమానులు. రాధిక ఇన్‌స్టా పోస్ ను సైతం షేర్ చేస్తూ వైరల్ చేస్తున్నారు.

ఇక రామాయణం సినిమాలో రణబీర్ కపూర్ రాముడిగా, సాయి పల్లవి సీతగా నటిస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం ముంబైలో ఈ మూవీకి సంబంధించి ఓ కీలక షెడ్యూల్ పూర్తి చేసుకున్నట్లు తెలుస్తోంది. యష్, రణబీర్ లపై కొన్ని కీలక సన్నివేశాలు షూట్ చేసినట్టు చెబుతున్నారు. తదుపరి షెడ్యూల్ వచ్చే వారం నుంచి ముంబైలోనే స్టార్ట్ చేయనున్నాట్టు సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఆ షెడ్యూల్‌లో యష్ తో పాటు ప్రధాన తారాగణంపై యుద్ధ నేపథ్య సన్నివేశాలు చిత్రీకరించనున్నారు.
ఈ మూవీ రెండు భాగాలుగా రానుండగా.. మొదటి భాగాన్ని 2026 దీపావళికి గ్రాండ్ గా విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. రెండవ భాగాన్ని 2027 దీపావళికి రిలీజ్ చేస్తారని టాక్ నడుస్తోంది. ఈ చిత్రంలో సన్నీ డియోల్, రకుల్, లారా దత్తా సహా పలువురు నటీనటులు నటిస్తున్నారు. టాక్సిక్ మూవీని సైతం త్వరలోనే రిలీజ్ చేసేందుకు యష్ సన్నాహాలు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications