కూతురిగా నటించిన నటితో పెళ్లికి రెడీ అయిన స్టార్ హీరో..?

ఈ రోజుల్లో ప్రేమ, ఎపైర్,పెళ్లి, బ్రేకప్, విడాకులు అనేవి సర్వ సాధారణంగా మారాయి. గతంలో సామాన్యుల జీవితాల్లో ప్రేమ పెళ్లి , విడాకులు అనేవి కనిపించేవి కాదు. కానీ మారుతున్న కాలంతో పాటు మనుషులు కూడా మారుతున్నారు. అయితే ఈ రోజుల్లో సామాన్యుల జీవితాల్లో కూడా ఎఫైర్స్, విడాకులు అనేవి కామన్‌గా మారిపోయాయి. ఇక సినీ సెలబ్రిటీల గురించి అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన పనేలేదు. సెలబ్రిటీలు పెళ్లి , విడాకులు అనేవి కామన్‌గా మారిపోయింది. ఏ రోజు ఏ సెలబ్రిటీ విడాకులు గురించి ప్రకటిస్తారో అని విధంగా మారిపోయింది పరిస్థితి.

ఇక విడిపోయిన వారు మరో పెళ్లి చేసుకోవడానికి కూడా ఏమాత్రం సంకోచించడం లేదనే చెప్పాలి. తాజాగా బాలీవుడ్ స్టార్ హీరో ముచ్చటగా మూడో పెళ్లికి రెడీ అయ్యాడు.బాలీవుడ్ స్టార్ హీరో ఆమిర్ ఖాన్ క్రేజ్ గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. బాలీవుడ్‌లో మిస్టర్ ఫర్‌ఫ్టెక్ట్‌గా పేరుగాంచిన ఆమిర్ ఖాన్ వరుస హిట్లతో తన స్టార్‌డంను అమాంతం పెంచుకున్నారు.

star hero ready to third marriage

ఆమిర్ ఖాన్ తన సినిమాలలో సామాజిక సందేశాలను అందించడానికి ప్రయత్నిస్తుంటారు.ఆయన 'సత్యమేవ జయతే' అనే టెలివిజన్ కార్యక్రమం ద్వారా సామాజిక సమస్యలపై ప్రజలలో అవగాహన కల్పించడానికి కృషి చేశారు.ఆమిర్ ఖాన్ భారతీయ సినిమాకు చేసిన కృషికి గాను అనేక పురస్కారాలు అందుకున్నారు. ఆయనకు పద్మశ్రీ , పద్మభూషణ్ వంటి ప్రతిష్ఠాత్మక పురస్కారాలు లభించాయి. ఇదే సమయంలో ఆయన వ్యక్తిగత జీవితం కూడా అనేక వివాదాలకు దారి తీసింది.

ఆమిర్ ఖాన్ ఇప్పటికే రెండు పెళ్లిళ్లు చేసుకున్నారు.ఇద్దరి భార్యలకు ఆయన విడాకులు ఇచ్చారు.ఆమిర్ ఖాన్ 1986 లో రీనా దత్తాను వివాహం చేసుకున్నాడు. వారికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. జునైద్ ఖాన్ మరియు ఐరా ఖాన్. వారు 2002లో విడాకులు తీసుకున్నారు.ఆమిర్ ఖాన్ 2005 లో కిరణ్ రావును వివాహం చేసుకున్నాడు.వారికి ఆజాద్ రావు ఖాన్ అనే కుమారుడు ఉన్నాడు. వీరు 2021లో విడాకులు తీసుకున్నారు.ఆమిర్ ఖాన్ ప్రస్తుతం మూడో పెళ్లికి రెడీ అవుతున్నారు.

ఆమిర్ ఖాన్ ఆ మధ్య నటితో ఫాతిమా సనా షేక్‌తో రిలేషన్‌లో ఉన్నారంటూ ప్రచారం జరిగింది. ఫాతిమా సనా షేక్ కారణంగానే కిరణ్ రావుకు ఆమిర్ ఖాన్ విడాకులిచ్చారనే రూమర్స్ తెర మీదకు వచ్చాయి. ఇదే సమయంలో వీరిద్దరు క్లోజ్‌గా మూవ్ అవుతున్న ఫొటోలు సైతం నెట్టింట వైరల్‌గా మారడంతో , వీరి రిలేషన్ గురించి పెద్ద ఎత్తున చర్చ సాగింది.

అయితే ఇవన్ని కూడా కేవలం ప్రచారం వరకు మాత్రమే మిగిలిపోయాయి. సరిగ్గా ఇదే సమయంలో మూడో పెళ్లిపై ఆమిర్ ఖాన్ కీలక ప్రకటన చేశారు.తాజాగా ఓ ఇంటర్య్వూలో ఆమిర్ ఖాన్ మాట్లాడుతూ..తాను ఇద్దరి మాజీ భార్యలతో ఇప్పటికీ సన్నిహితంగానే ఉన్నానని స్పష్టం చేశారు. ఇదే సమయంలో తాను మూడో పెళ్లికి సిద్దమవుతున్నట్టు ఆమిర్ ఖాన్ ప్రకటించారు. అయితే తాను చేసుకోబోయే అమ్మాయి గురించి మాత్రం ఆమిర్ క్లారిటీ ఇవ్వలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+