పూజా హెగ్డే హీారోయిన్‌గానా..? అయితే వద్దులే.. తెలుగు హీరో సంచలనం
హీరోయిన్ పూజా హెగ్దే క్రేజ్ గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో సినిమాలు చేస్తూ స్టార్ హీరోయిన్‌గా మారింది. ఒకప్పుడు టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ అందరు ఠక్కున పూజా హెగ్దే పేరునే చెప్పేవారు. దాదాపు టాలీవుడ్ టాప్ హీరోలందరి సరసన నటించింది. మహేష్ బాబుతో 'మహర్షి', ప్రభాస్‌తో 'రాధే శ్యామ్', ఎన్టీఆర్ సరసన 'అరవింద సమేత', అల్లు అర్జున్‌తో 'అల వైకుంఠపురం' సినిమాల్లో నటించి మెప్పించింది.
తెలుగు ఇండస్ట్రీలో కొన్నేళ్ళ టాప్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగిన పూజా హెగ్డే... అనూహ్యంగా కనుమరుగైంది. వరుస ఫ్లాపులు రావడంతో బుట్టబొమ్మ రేసులో వెనుక పడిపోయింది. 'రాధే శ్యామ్', 'ఆచార్య', 'బీస్ట్', 'సర్కస్', 'కిసీ కా భాయ్ కిసీ కీ జాన్' ఇలా ఆమె నటించిన సినిమాలన్నీ కూడా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయి. ఇదే సమయంలో శ్రీలీలకు తెలుగులో డిమాండ్ పెరగడంతో పూజా హెగ్డేను టాలీవుడ్ పూర్తిగా పక్కన పెట్టేసింది.

పైగా గురుజీ సైతం 'గుంటూరు కారం' సినిమా నుంచి తప్పించడంతో.. పూజా హెగ్డేకు తెలుగులో ఒక్క సినిమా కూడా లేకుండా పోయింది. అయితే అమ్మడుకు వరుస ఊహించని విధంగా మళ్లీ రేసులోకి దూసుకువచ్చింది. విజయ్ ,సూర్య వంటి స్టార్ హీరోల సినిమాల్లో హీరోయిన్‌గా అవకాశాలు దక్కించుకుంది. బాలీవుడ్‌లో కూడా ఓ సినిమాకు గ్రీన్ సీగ్నల్ ఇచ్చింది. షాహిద్ కపూర్ హీరోగా నటించిన 'దేవా' సినిమాలో కూడా పూజా హెగ్డే హీరోయిన్‌గా నటించింది.
మరోవైపు సోషల్ మీడియాలో కూడా తన హవాను చూపిస్తోంది ఈ హాట్ బ్యూటీ. ఇదిలా ఉంటే తాజాగా ఓ స్టార్ హీరో సినిమా నుంచి పూజా హెగ్డేను తప్పించారనే ప్రచారం జరుగుతోంది. తమిళ స్టార్ హీరో ధనుష్ చేయబోతున్న కొత్త సినిమాలో పూజా హెగ్డేను హీరోయిన్‌గా ఎంపిక చేశాడు దర్శకుడు. పూజా హెగ్డే సైతం ఈ సినిమాకు కావాల్సిన కాల్‌షీట్స్‌ను ఇచ్చారని తెలిసింది. అయితే ఏం జరిగిందో తెలియదు కానీ..సడన్‌గా ఈ సినిమా నుంచి పూజా హెగ్డేను తొలగించారని తెలుస్తోంది.
ఆమె స్థానంలో ప్రేమలు బ్యూటీ మమిత బైజును ఎంపిక చేశారనే ప్రచారం జరుగుతోంది. హీరో ధనుష్ సూచన మేరకే పూజా హెగ్డే స్థానంలో మమిత బైజును తీసుకున్నారని తెలుస్తోంది.మొదట తీసుకోవడం ఎందుకు, ఆ తర్వాత తీసేయడం ఎందుకని వాపోతున్నారట పూజా హెగ్డే. ఈ విషయంలో బుట్టబొమ్మ బాగానే హార్ట్ అయినట్టు సమాచారం.అయితే ఇందులో ఎంత వరకు వాస్తవం ఉందో తెలియాల్సి ఉంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వార్త నెట్టింట వైరల్‌గా మారింది.












Click it and Unblock the Notifications