జూనియర్ ఎన్టీఆర్ వల్ల కెరీర్ పతనమైన స్టార్ హీరో?
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో దేవర చిత్రం చేస్తున్నారు. నందమూరి కల్యాణ్ రామ్, మిక్కిలినేని సుధాకర్ దీన్ని నిర్మిస్తున్నారు. అనిరుధ్ రవిచందర్ స్వరాలందిస్తున్నారు. ఈ పాన్ ఇండియా సినిమా సెప్టెంబరు 27వ తేదీన విడుదల కాబోతోంది. ఆర్ఆర్ఆర్ తర్వాత తారక్ నుంచి వస్తున్న సినిమా ఇదే కావడం గమనార్హం. దీనికి ముందు త్రివిక్రమ్ దర్శకత్వంలో అరవింద సమేత సినిమా చేశారు. ఈ ఆరు సంవత్సరాల కాలంలో జూనియర్ ఎన్టీఆర్ దగ్గర నుంచి కేవలం రెండు సినిమాలే రావడంతో అతని ప్రణాళిక సరిగా లేదంటూ సినీ విమర్శకులు వాగ్బాణాలు సంధిస్తున్నారు.
బాద్ షాలో ప్రత్యేక పాత్రలో సిద్ధార్థ్
దేవర తర్వాత హృతిక్ రోషన్ తో కలిసి వార్2లో నటిస్తున్నారు. దీని తర్వాత ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నారు. గతంలో తారక్ శ్రీను వైట్ల దర్శకత్వంలో బాద్ షా సినిమా చేశారు. ఈ సినిమాలో అప్పటి స్టార్ నటుడు సిద్ధార్థ్ ప్రత్యేక పాత్రలో నటించారు. ముందుగా వేరే హీరోను తీసుకోవాలని దర్శకుడు అనుకున్నప్పటికీ జూనియర్ ఎన్టీఆర్ మాత్రం పట్టుబట్టి సిద్ధార్థ్ చేత నటింపచేశారు. తారక్ కు సోదరుడిగా నటించారు. ఇందులో జరిగే బాంబు పేలుళ్లల్లో సిద్ధార్థ్ మరణిస్తాడు. అప్పటినుంచి సిద్ధార్థ్ కు సరైన అవకావాలు రావడంలేదని చెప్పొచ్చు.

ఒకసారి ఒక పాత్రలో కనిపిస్తే వారే ఉండాలి
ఇప్పుడు తెలుగు ప్రేక్షకుల ఆలోచనా పరిధి విస్తరించింది. అయితే బాద్ షా సమయంలో మాత్రం వారి ఆలోచన వేరుగా ఉండేది. ఓ పాత్రలో హీరో కనిపిస్తే అలాంటి పాత్రల్లోనే ఆ హీరో కనపడాలని కోరుకునేవారు. తర్వాత వారికి హీరోగా అవకాశాలు కూడా వచ్చేవి కావు. సరిగ్గా సిద్ధార్థ్ విషయంలో కూడా ఇదే జరిగిందని సినీ విశ్లేషకులు అంటున్నారు. మంచి జోరుమీద ఉన్న సిద్ధార్థ్ కెరీర్ ఒక్కసారిగా నత్తనడకకు పడిపోయిందని, ఇలా అవడానికి ఎన్టీఆరే కారకుడని పరిశ్రమలో చర్చలు జరిగాయి. ప్రస్తుతం కమల్ హాసన్ కథానాయకుడిగా వస్తున్న భారతీయుడు2 చిత్రంలో సిద్ధార్థ్ నటించాడు. ఈ సినిమాతో అయినా పూర్వ వైభవం పొందాలని భావిస్తున్నాడు.












Click it and Unblock the Notifications