ఆ హీరోయిన్ కోసం ఒక్కరోజులో రూ.2 కోట్లు ఖర్చుపెట్టిన తెలుగు స్టార్ హీరో
సినీ పరిశ్రమ అనగానే ప్రేమించుకోవడం, పెళ్లిళ్లు చేసుకోవడం, విడాకులు తీసుకోవడం అనేది సర్వసాధారణంగా జరుగుతుంటాయి. అలాగే ఇక్కడ సహజీవనాలు, డేటింగ్స్ అనేవి కూడా సర్వసాధారణం. ఇటువంటి వాతావరణం నెలకొన్న పరిశ్రమలో ప్రస్తుతం ఓ వార్త వైరలవుతోంది. పరిశ్రమలో స్టార్ హీరోగా కొనసాగుతున్న ఓ హీరో టాప్ హీరోయిన్ కోసం ఒక్కరోజులో రూ.2 కోట్లు ఖర్చు పెట్టినట్లు తెలుస్తోంది. ఈ విషయం తెలుసుకొని సినీ పరిశ్రమ ఆశ్చర్యపోయింది. ఈ డబ్బుతో రెండు చిన్న బడ్జెట్ సినిమాలు తీయొచ్చంటూ కొందరు విమర్శిస్తున్నారు.
ఒంటరిగానే కొనసాగుతున్నాడు
పరిశ్రమలో అతను ఒక టాప్ సెలబ్రిటీ అని చెప్పొచ్చు. అయితే ఆ హీరోయిన్ కోసం అంత ఖర్చు ఎందుకు పెట్టాడు? ఎందుకు అంత ఖర్చు పెట్టాల్సి వచ్చింది? అంటూ ఆశ్చర్యపోతున్నారు. ఆ హీరో కోట్లరూపాయల ఆస్తికి వారసుడు. అయితే ఆ హీరోయిన్ చాలా బాగుంటుందని, ఆమె అందానికి అంత ఖర్చుపెట్టివుంటాడని, అందులో తప్పులేదని మరికొందరు సమర్థిస్తున్నారు. తర్వాత కొన్ని రోజులకు ఆ హీరోయిన్ ఈ స్టార్ హీరోకు ఊహించనిరీతిలో గట్టి షాక్ ఇచ్చింది. ముంబయికి చెందిన ఓ వ్యాపారవేత్తను వివాహం చేసుకొని జీవితంలో స్థిరపడింది. అయితే ఆ స్టార్ హీరో మాత్రం పెళ్లి చేసుకోకుండా ఒంటరిగానే కొనసాగుతున్నారు. అతను కేవలం ఆ హీరోయిన్ తో వివాహం వద్దనుకొని రిలేషన్ మాత్రమే చేశాడా? లేదంటే పెళ్లి చేసుకుందామనుకున్నాడా? అనే విషయంలో మాత్రం స్పష్టత లేదు.

విషయాన్ని ఆరా తీస్తున్న నెటిజన్లు
ప్రస్తుతం ఆ హీరో ఎవరు? ఆ హీరోయిన్ ఎవరు? అనే విషయాన్ని నెటిజన్లు ఆరా తీస్తున్నారు. పరిశ్రమలో ఎంతోమంది ప్రేమించుకుంటున్నారు.. ఆ తర్వాత పెళ్లి చేసుకుంటున్నారు. అయితే వీరిలో కొంతమందే అన్యోన్యంగా కాపురం చేస్తున్నారు. భారతీయ సాంప్రదాయాలపై, వివాహ వ్యవస్థపై గౌరవం ఉంచి చూడముచ్చటైన జంటగా కాపురం చేసుకుంటున్నారు. మరికొందరు మాత్రం సాంప్రదాయాలకు, వివాహ వ్యవస్థకు గౌరవం ఇవ్వకుండా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. తెలుగులో ఎంతోమంది హీరో, హీరోయిన్లు ప్రేమించి పెళ్లిచేసుకొని కాపురం చేసుకుంటున్నారు. వారిని చూసైనా నేర్చుకోవాలని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.












Click it and Unblock the Notifications