బాలయ్య షోలో కంటతడి పెట్టిన స్టార్ హీరో సూర్య...
నటుడు బాలకృష్ణ వ్యాఖ్యతగా వ్యవహరిస్తున్న అన్‌స్టాపబుల్ షోలో సినీ సెలబ్రిటీలు పాల్గొంటున్నారు. అయితే, తాజాగా ఈ షోలో తమిళ స్టార్ హీరో సూర్య పాల్గొన్నారు. ఈ షోకి సంబంధించిన ప్రోమోని విడుదల చేశారు. ఈ వీడియో సుమారు నాలుగున్నర నిమిషాల పాటు సాగింది. ఇక, ఈ షోలో సూర్యతో పాటు 'కంగువ' దర్శకుడు శివ, నటుడు బాబీ డియోల్ కూడా పాల్గొన్నారు. కంగువ సినిమా ఈ నెల 14వ తేదిన థియేటర్లలోకి సందడి చేయనుంది.
సూర్య, తన భార్య జ్యోతిక, తమ్ముడు కార్తి గురించి పలు ఆసక్తికర విషయాలను ఈ షోలో బాలకృష్ణతో పంచుకున్నారు. బాలయ్యబాబుతో సూర్య చాలా సరదాగా మాట్లాడారు. కార్తి తన ఫోన్‌లో సూర్య నంబర్‌ను ఏమని సేవ్ చేసుకుంటారని బాలకృష్ణ అడగ్గా.. అది అవుట్ ఆఫ్ సిలబస్ అంటూ నవ్వుకున్నారు. తన మొదటి క్రష్ ఎవరో చెప్పాలని బాలకృష్ణ కోరగా.. 'వద్దు సర్ ఇంటికి వెళ్లాలి.. గొడవలు అవుతాయంటూ సరదాగా మాట్లాడారు.

అయితే, బాలకృష్ణ వెంటనే సూర్య తమ్ముడు కార్తికి లైవ్‌లో ఫోన్ చేసి ఈ విషయం గురించి అడిగారు. సూర్యకు ఓ హీరోయిన్ అంటే బాగా ఇష్టమని ఈ సందర్భంగా కార్తి చెప్తాడు. దీంతో 'నువ్వు కత్తిరా.. కార్తి కాదు' అంటూ సూర్య సరదాగా అంటాడు. ఇక జ్యోతిక విషయానికొస్తే.. 'తను లేకుండా నా జీవితాన్ని ఊహించుకోలేను' అంటూ సూర్య కాస్త ఎమోషనల్ అయ్యే సన్నీవేశాలను చూపిస్తారు.

మరోసారి ఎమోషనల్
నటుడు సూర్య 'అగరం' ఫౌండేషన్ స్థాపించి ఎందరో విద్యార్థులకు అండగా నిలుస్తున్నాడు. గతంలో ఓసారి అమ్మాయి స్టేజీపై మాట్లాడుతుంటే పక్కనే ఉన్న సూర్య కన్నీళ్లు పెట్టుకున్న సంగతి తెలిసిందే. ఇక, ఇప్పుడు కూడా 'అన్‌స్టాపబుల్' షోలోనూ ఆ వీడియో ప్లే చేయగా, సూర్య మరోసారి ఎమోషనల్ అయి కంటతడి పెట్టుకున్నాడు. ఈ షోకు సంబంధించిన ఫుల్ ఎపిసోడ్ నవంబర్ 8వ తేదిన రిలీజ్ అవుతుంది. బాలకృష్ణ, సూర్యల మధ్య సాగిన సరదా సంభాషణ నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటోంది.
-
నేడు, రేపు ఆకాశంలో ఓ అద్భుతం- డోన్ట్ మిస్ -
'బిడ్డను పెంచడానికి ఆ పనికైనా సిద్ధమే' -
" ప్లీజ్.. ఆ విషయంలో భారత్ ను అడుక్కుంటున్న అమెరికా " -
‘ఉస్తాద్ భగత్ సింగ్’ సెన్సార్ రివ్యూ.. 5కి ఎంత రేటింగ్ ఇచ్చారంటే..! -
టీమిండియా విజయం వెనుక ప్రభాస్.. అసలు విషయం చెప్పిన సూర్యకుమార్ యాదవ్ -
ఆ హీరోతో లిప్ లాక్ చేశానని మా పేరెంట్స్ తిట్టారు - స్టార్ బ్యూటీ -
అన్నదాత సుఖీభవ నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే మీ ఖాతాల్లో..!! -
పేక మేడలా కుప్పకూలుతున్న బంగారం ధరలు -
ప్రపంచంలోనే చీపెస్ట్ కంట్రీ.. హైదరాబాద్ నుంచి ఎలా వెళ్లాలి..? -
వాషింగ్టన్ ఎయిర్ పోర్టుల్లో అనూహ్య పరిణామం: యుద్ధ భయాల మధ్య.. !! -
ఆటో డ్రైవర్లకు ప్రభుత్వం బంపరాఫర్- వంద శాతం సబ్సిడీతో కొత్తగా.. మార్గదర్శకాలు..!! -
అలా చేస్తే గ్యాస్ సిలిండర్ బుకింగ్ సాధ్యం కాదు- కేంద్రం క్లారిటీ.. !!












Click it and Unblock the Notifications