Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

అతనితో బలవంతంగా లిప్ కిస్ పెట్టించారు.. స్టార్ హీరోయిన్ సంచలనం

ఒకప్పుడు సినిమాలు కుటుంబ సమేతంగా కూర్చొని చూడదగే విధంగా ఉండేవి. కానీ ఇప్పుడు కాలం మారడంతో సినిమాలు కూడా ట్రెండ్‌కు తగ్గట్టుగా మారుతున్నాయి. నేటి తరం సినిమాల్లో ముద్దు సీన్లతో పాటు, శృంగారభరిత సన్నివేశాలతో నింపేస్తున్నారు. దీంతో థియేటర్లకు వచ్చే ఫ్యామిలీ ఆడియెన్స్ సంఖ్య తగ్గిపోతూ వస్తుంది. ఒకప్పుడు సినిమాలో ముద్దు సీన్లు ఉంటే వార్త. ఇప్పుడు ఎన్ని ముద్దు సీన్లు ఉంటే అంత పెద్ద వార్త అన్నట్టుగా సినిమా మారిపోయింది.

గతంలో నటులు ముద్దు సీన్లలో నటించడానికి తెగ మొహమాట పడేవారు. కానీ నేటితరం నటులైతే ముద్దు సీన్లు బట్టి తమ పారితోషికం డిమాండ్ చేయడం పరిపాటిగా మారింది. తాజాగా ముద్దు సీన్‌కు సంబంధించి ఓ హీరోయిన్ చేసిన కామెంట్స్ ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది. అలనాటి హీరోయిన్ మధుబాల ముద్దు సన్నివేశంపై షాకింగ్ కామెంట్స్ చేశారు.దీనిపై పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఈ తరం ప్రేక్షకులకు మధుబాల గురించి పెద్దగా తెలియకపోవచ్చు కానీ, 1990ల్లో సినీ అభిమానులకు మధుబాల సుపరిచితురాలే.

Star heroine forced to kiss lips with that hero

తెలుగు ప్రేక్షకులకు 'రోజా' సినిమాతో అత్యంత చేరువైన పేరు మధుబాల. ఆ సినిమాతో ఆమె కేవలం దక్షిణాదిలోనే కాదు, దేశవ్యాప్తంగా ప్రేక్షకులను తన అందంతో, అమాయకత్వంతో, అద్భుతమైన నటనతో కట్టిపడేసింది. అలనాటి బాలీవుడ్ అందాల తార హేమా మాలిని మేనకోడలిగా సినీ రంగ ప్రవేశం చేసినా, మధుబాల తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును దక్కించుకుంది. 'జెంటిల్ మ్యాన్', 'అల్లరి ప్రియుడు', 'మిస్టర్ రోమియో' వంటి సూపర్ హిట్ చిత్రాల్లో , మధుబాల నటించారు.

తాజాగా మధుబాల ఓ ఇంటర్వ్వూలో షాకింగ్ కామెంట్స్ చేశారు. ఓ సినిమాలో ముద్దు సన్నివేశం గురించి మాట్లాడారు. తన కెరీర్‌లో ఎప్పుడూ కూడా ముద్దు సన్నివేశాల్లో నటించలేదని, అలాంటిది ఓ సినిమాలో అలాంటి సన్నివేశంలో నటించాల్సి వచ్చిందని ఆమె వెల్లడించారు.సినిమా షూటింగ్ మొదలైన తర్వాత, డైరెక్టర్ ఒక లిప్ లాక్ సీన్ చేయాలని కోరారట. ఈ విషయం తనకు ముందుగా చెప్పలేదని, అసలు అలాంటి సన్నివేశాల్లో నటించే ఉద్దేశం లేదని మధుబాల డైరెక్టర్ తో స్పష్టం చేసి, అక్కడి నుండి వెళ్ళిపోయారట.

మధుబాల వెళ్ళిపోయిన తర్వాత, ఆ సినిమాలో నటించే మరికొంతమంది నటీనటులు ఆమె వద్దకు వచ్చి సర్ది చెప్పారట. "ఈ లిప్ లాక్ సీన్ సినిమాకి హైలైట్‌గా నిలుస్తుంది. ఈ సీన్ మీరు చేయనంటే సినిమాకి పెద్ద మైనస్ అవుతుంది" అని వారు మధుబాలకు వివరించారట.చివరికి, తన నిర్ణయాన్ని మార్చుకొని, ఇష్టం లేకపోయినా, తనలోని అసౌకర్యాన్ని పక్కన పెట్టి మధుబాల ఆ లిప్ లాక్ సీన్‌లో నటించారట. అయితే, ఇక్కడ ఒక ఆసక్తికరమైన మలుపు ఉంది. అంత కష్టపడి, తన నియమాన్ని బ్రేక్ చేసి చేసిన ఆ ముద్దు సన్నివేశం, సినిమా ఎడిటింగ్‌లో తీసేశారట!

ఈ విషయం తెలిసినప్పుడు ఆమెకు చాలా బాధ, కోపం వచ్చాయని మధుబాల వెల్లడించారు. "అంత కష్టపడి, బలవంతంగా ఈ లిప్ లాక్ సీన్ చేస్తే కనీసం నా కష్టానికి గుర్తింపు ఇచ్చి ఈ లిప్ లాక్ సీన్ ఉంచలేదు" అని ఆమె బాధపడినా, డైరెక్టర్‌తో గొడవ పెట్టుకోలేదట. ఈ సంఘటన ఆమెకు ఒక గొప్ప పాఠంగా నిలిచిందని, నటిగా అన్ని రకాల సన్నివేశాల్లో నటించడానికి తాను సిద్ధంగా ఉండాలని అప్పుడే నిర్ణయించుకున్నానని మధుబాల చెప్పుకొచ్చారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+