రెండో బిడ్డకు జన్మనిచ్చిన స్టార్ హీరోయిన్..!
సినీ పరిశ్రమలో స్టార్ హీరోయిన్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది ఇలియానా డీక్రూజ్. లేటెస్ట్ గా ఈమె ఓ తీపి కబురును సోషల్ మీడియా వేదికగా పంచుకుంది. జూన్ 19న మగ బిడ్డకు జన్మనిచ్చినట్టు ప్రకటించింది. అలానే బాబుకు 'కియాను రఫే డోలన్' అని పేరు పెట్టినట్లు తెలిపింది. బాబు ఫోటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయడంతో పిక్ ఫుల్ వైరల్ అవుతోంది. దీంతో ఇలియానాకు సినీ ప్రముఖులు, నెటిజన్ల నుంచి శుభాకాంక్షలు చెబుతూ పోస్టులు పెడుతున్నారు.
కాగా ఇలియానా 2023 ఆగస్టులో మొదటి బిడ్డకు జన్మనిచ్చానని ఇలియానా పోస్ట్ పెట్టింది. బాబుకు 'కోవా ఫీనిక్స్ డోలన్' అని పేరు కూడా పెట్టినట్టు రాసుకొచ్చింది. అప్పటికీ తన మ్యారేజ్ విషయం సీక్రెట్ గా ఉంచడంతో ఆమె భర్త ఎవరని తెగ పోస్టులు పెట్టారు. ఆ తర్వాత మైఖేల్ డోలన్‌ను రహస్యంగా వివాహం చేసుకున్నట్టు క్లారిటీ ఇవ్వడంతో విషయం సర్దుమనిగింది.

ఇలియానా కెరీర్ విషయానికి వస్తే.. 2006లో 'దేవదాస్' సినిమా ద్వారా తెలుగు చిత్రసీమలోకి అడుగుపెట్టారు. తరువాత 'పోకిరి', 'జల్సా', 'కిక్', 'జులాయి' వంటి వరుస హిట్ చిత్రాల్లో నటించి టాప్ హీరోయిన్‌గా ఎదిగారు. చివరగా 2018లో రవితేజతో కలిసి 'అమర్ అక్బర్ ఆంటోనీ' చిత్రంలో కనిపించింది.
అలానే హిందీ చిత్రాల్లో కూడా నటించి మెప్పించింది ఈ ముద్దుగుమ్మ. 'దో ఔర్ దో ప్యార్', 'బర్బార్ దేఖో', 'పఘలెట్' వంటి సినిమాల్లో నటించారు. ఇటీవల ఆమెకు 'రైడ్ 2' అనే భారీ బాలీవుడ్ ప్రాజెక్ట్‌లో నటించే అవకాశం వచ్చినప్పటికీ, కొన్ని కారణాలతో దానిని వదిలేసింది. ప్రస్తుతం ఆమె సినిమాలకు దూరంగా ఉంటున్న ఈ భామ.. కుటుంబ జీవితం గడుపుతూ సంతోషంగా ఉన్నట్టు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications