ముగ్గురు పిల్లల తండ్రిని వివాహం చేసుకున్న స్టార్ హీరోయిన్
చాలామంది హీరోయిన్లు పెళ్లైన వ్యక్తులనే ప్రేమించి పెళ్లి చేసుకుంటున్నారు. అందాల తార శ్రీదేవి భర్త బోనీ కపూర్‌కు అంతకముందే వివాహం జరిగింది. అయిన శ్రీదేవి అతన్ని ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఇక పవన్ కల్యాణ్‌కు మొదటి భార్యకు విడాకులిచ్చారనే విషయం తెలిసి కూడా అతనితో సహజీవనం చేసి తరువాత వివాహం ఆడింది హీరోయిన్ రేణు దేశాయ్. తాజాగా హీరో సిద్ధార్ధ్ విషయంలో కూడా ఇదే జరిగింది.
హీరో సిద్ధార్ధ్‌కు గతంలో పెళ్లైందనే విషయం అందరికి తెలిసిందే. మేఘన అనే తన ఇంటి పక్కన అమ్మాయిని పెళ్లి చేసుకున్న హీరో సిద్ధార్ధ్ ..ఆమెతో ఇద్దరు పిల్లల్ని కూడా కన్నాడు. తాజాగా హీరోయిన్ అదితి రావు హైదరితో కొన్నాళ్లు డేటింగ్ చేసి.. చివరికి ఆమెను పెళ్లాడాడు. ఇదిలా ఉంటే గతంలో స్టార్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగిన జయప్రద సైతం పెళ్లై ముగ్గురు పిల్లలున్న వ్యక్తిని వివాహం చేసుకుని సంచలనం సృష్టించింది.

ఎన్టీఆర్, నాగేశ్వరరావు, కృష్ఱ, చిరంజీవి, కమల్ హాసన్ వంటి స్టార్ హీరోలతో జయప్రద నటించింది. ముఖ్యంగా ఆ రోజుల్లో శ్రీదేవి, జయసుధ వంటి హీరోయిన్లకు జయప్రద గట్టి పోటినిచ్చింది. తెలుగు,తమిళ, కన్నడ, హిందీ భాషల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. జయప్రద బాలీవుడ్ నిర్మాత శ్రీకాంత్ సహతను వివాహం చేసుకుంది.అయితే ఆయనకు అప్పటికే మరో మహిళతో వివాహం జరిగింది.
వారికి ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారు. శ్రీకాంత్ సహతకు పెళ్లైందనే విషయం తెలిసి కూడా ఆయన్ను రెండో వివాహం చేసుకుంది జయప్రద. అప్పటికే పీకల్లోతు ప్రేమలో ఉండటంతో జయప్రద అతన్ని విడిచి ఉండలేక వివాహం చేసుకుందట. అయితే శ్రీకాంత్ సహత తన మొదటి భార్యకు విడాకులు ఇవ్వకుండానే జయప్రదను వివాహం చేసుకున్నాడు. ఈ విషయాన్ని జయప్రదనే స్వయంగా ఓ ఇంటర్య్వూలో తెలిపింది. ప్రేమ గుడ్డిదంటారని తెలుసు కానీ.. మరీ ఇంత గుడ్డిగా ఉంటుందా అనేది ఇలాంటి విషయాలను చూస్తే అర్ధం అవుతోందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.












Click it and Unblock the Notifications