సినిమా ఒప్పుకున్న సమంత.. హీరోగా అతనే?
తెలుగు సినీ పరిశ్రమలో స్టార్ హీరోయిన్ గానే కాదు.. నెంబర్ వన్ హీరోయిన్ గా కూడా కొనసాగుతున్న సమంత గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరంలేదు. నాగచైతన్యతో వివాహానికి ముందు ఎంత పేరొచ్చిందో.. వాళ్లిద్దరూ విడాకులు తీసుకున్న తర్వాత అంతకన్నా ఎక్కువ పేరును సమంత సంపాదించుకుంది. మయోసైటిస్ తో బాధపడుతూ కొద్దికాలం నుంచి సినిమాలకు దూరం జరిగింది. చికిత్స కోసం విదేశాలకు వెళ్లివచ్చింది. తాను ఎక్కడ ఉన్నా, ఏం చేస్తున్నా ఎప్పటికప్పుడు అప్ డేట్ ను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ అభిమానులకు దగ్గరగానే ఉంటుంది.
చికిత్స తీసుకునే క్రమంలో అప్పటికే ఒప్పుకున్న సినిమాలకు సంబంధించి తీసుకున్న అడ్వాన్స్ లను నిర్మాతలకు తిరిగిచ్చేసింది. ఇటీవల నుంచే కథలను వింటోంది. వెబ్ సిరీస్ లో అత్యధిక రెమ్యునరేషన్ తీసుకునే హీరోయిన్ గా కూడా రికార్డ్ సృష్టించింది. తన స్నేహితురాలు నందినిరెడ్డి తీసే సినిమాలో నటించాలనుకున్నప్పటికీ ఎందుకనో ఆ నిర్ణయాన్ని వాయిదా వేసుకుంది. ఒకరకంగా ఆమె తెలుగు సినీ పరిశ్రమకు గుడ్ బై చెప్పబోతోందంటూ వార్తలు వచ్చాయి.

అయితే వాటన్నింటినీ ఖండిస్తూ తెలుగులో ఓ సినిమాలో చేయడానికి ఒప్పుకున్నట్లు తెలిసింది. హీరోయిన్ ప్రాధాన్యత ఉన్న చిత్రమని, ఓ యంగ్ హీరో కథానాయకుడిగా నటించబోతున్నట్లు సమాచారం. ఆ హీరో ఎవరనే విషయంపై పూర్తి స్పష్టత రాలేదు. గతంలో తాను నటించిన హీరోయేనా? లేదంటే కొత్త హీరోనా? అనేది తెలియాల్సి ఉంది.
ఇదే కాకుండా బాలీవుడ్ లో రెండు సినిమాలు, హాలీవుడ్ లో ఓ సినిమా ఒప్పుకుంది. మరోవైపు సొంతంగా ప్రొడక్షన్ హౌస్ స్థాపించిన సంగతి తెలిసిందే. దీనిద్వారా కొత్తవారిని ప్రోత్సహించబోతోంది. సమంత నిర్ణయాన్ని అభిమానులు సాదరంగా స్వాగతిస్తున్నారు. ఆమెను ఎప్పుడ అభిమానిస్తూనే ఉంటామని, నాగచైతన్యతో మరోసారి కలిసిపోతే చూడాలని ఉందంటూ కామెంట్లు పెడుతున్నారు. తన రెండో ఇన్నింగ్స్ లో సమంత ఎలా రాణిస్తుందో చూడాలి.
-
పెళ్లికి ముందే గొడవలు.. రష్మిక తల్లి వీడియో వైరల్! -
మెగాస్టార్ చిరంజీవి మాతృమూర్తి "అంజనా దేవి"కి స్పెషల్ అవార్డు..! -
విడాకులు తీసుకున్న టాలీవుడ్ స్టార్ హీరోయిన్.. 4 ఏళ్లకే! -
దెబ్బకు దిగొచ్చిన హరీష్ శంకర్ -
45కి పైగా దేశాల్లో "దురంధర్ 2" నయా రికార్డ్.. పవన్ మూవీ సర్దేసుకోవడమే !! -
మళ్లీ నోరు జారిన రాజేంద్రప్రసాద్.. ఏకంగా మాజీ సీఎంపై.. వీడియో -
విజయ్- రష్మిక పెళ్లి వేళ 'అర్జున్ రెడ్డి' హీరోయిన్ పోస్ట్ వైరల్.. -
మరో హిట్ గ్యారంటీ .. కొత్త కాన్సెప్ట్‌తో వస్తున్న హీరో -
ఓటీటీలోకి లేటెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ.. ప్రభాస్ మెచ్చిన సినిమా.. -
ఇండియన్ స్క్రీన్‌పై ఇప్పటివరకు రాని కథతో సినిమా..! -
ఎవరీ మార్క్ కె రాబిన్.. ఎందుకు ఆయనకు అంత క్రేజ్ -
‘ఉస్తాద్ భగత్ సింగ్’ సెన్సార్ పూర్తి.. వారు ఏమన్నారంటే?












Click it and Unblock the Notifications