నాగచైతన్య - శోభిత రిలేషన్ పై స్పందించిన సమంత
తెలుగు సినీ పరిశ్రమకు ఏమాయ చేశావే సినిమాతో పరిచయమైన సమంత అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ గా మారింది. నాగచైతన్యను ప్రేమించడం, పెళ్లిచేసుకోవడం, తర్వాత విడాకులు తీసుకోవడం అన్నీ అలా జరిగిపోయాయి. కొన్ని కొన్ని సందర్భాల్లో పరోక్షంగా నాగచైతన్యపై సమంత కామెంట్స్ చేసేదికానీ నాగచైతన్య మాత్రం ఎక్కడా సమంత గురించి ఒక్కమాట కూడా మాట్లాడలేదు. సోషల్ మీడియాలో ఎప్పుడూ చురుగ్గా ఉండే ఈ ముద్దుగుమ్మ తాజాగా చేసిన పోస్ట్ ఒకటి సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.
తన ఇన్‌స్టాగ్రామ్‌లో మీరు వృషభ రాశిని ఎప్పటికీ కోల్పోకండి అంటూ ఓ కోట్ షేర్ చేసింది. సమంతది వృషభరాశి. దీనికి అర్థం ఏమిటంటే ఎప్పటికీ వెనకడుగు వేయను అని. ఆ విషయాన్ని పరోక్షంగా చెప్పుకొచ్చిందని నెటిజన్లు అభిప్రాయడపతున్నారు. ఇటీవలి కాలంలో నాగచైతన్య - శోభిత ధూళిపాళ్లకు సంబంధించి అనేక రూమర్లు వస్తున్న విషయం తెలిసిందే. వీరిద్దరూ ఎంజాయ్ చేస్తున్నారని, చైతన్య కట్టించిన కొత్త ఇంట్లోకి శోభిత అప్పుడప్పుడు వెళ్లివస్తుంటుందని, త్వరలోనే వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారంటూ రకరకాల వార్తలు చక్కర్లు కొట్టేవి.

సరిగ్గా ఇటువంటి సమయంలోనే సమంత చేసిన పోస్ట్ హాట్ టాపిక్ గా మారింది. చైతూ, శోభిత రూమర్స్ పై సమంత పరోక్షంగా స్పందించిందని, వారికి గట్టిగానే కౌంటర్ ఇచ్చిందంటున్నారు అభిమానులు. సామ్ చేసిన పోస్టు మాత్రం వైరల్ గా మారింది. ఏడాది పాటు సినిమాలకు విరామం ప్రకటించిన సమంత ప్రస్తుతం కథలను వింటోంది. వెబ్ సిరీస్ లో కూడా నటిస్తోంది. అట్లీ-అల్లు అర్జున్ కాంబినేషన్ లో రాబోతున్న సినిమాలో హీరోయిన్ గా ఎంపికైందంటూ వార్తలు వస్తున్నాయి. తన సొంత నిర్మాణ సంస్థలో మా ఇంటి బంగారం అనే ప్రాజెక్టు చేస్తోంది.












Click it and Unblock the Notifications