కుక్కతో కలిసి ఆ పని చేస్తున్న స్టార్ హీరోయిన్..
దక్షిణాది చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోయిన్ త్రిష తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంది. ఒకప్పుడు తెలుగు, తమిళం, కన్నడ భాషలలో అనేక హిట్ చిత్రాల్లో నటించిన ఈ అమ్మడు.. తెలుగులో కూడా దాదాపు అందరు స్టార్ హీరోలతో నటించింది. చిరంజీవి, వెంకటేష్, బాలకృష్ణ, నాగార్జున.. మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్ లతో కూడా నటించి మెప్పించింది. ఇక మధ్యలో కాస్త బ్రేక్ తీసుకున్న ఈ భామ.. సెకండ్ ఇన్నింగ్స్‌లోనూ వరుస సినిమాలతో దూసుకుపోతుంది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ చేతిలో దాదాపు 7 సినిమాలకు పైనే ఉన్నాయి.
సినిమాల పరంగానే కాకుండా సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉండే త్రిష.. తన చిత్రాల గురించే కాకుండా, పర్సనల్ లైఫ్ గురించి కూడా పలు ఆసక్తికర పోస్టులు పెడుతూ ఉంటుంది. ఈ క్రమంలోనే త్రిష లేటెస్ట్ గా పోస్ట్ చేసిన వీడియో ఇప్పుడు ఫుల్ వైరల్ గా మారింది. తన కుక్క పిల్లతో కలిసి మార్నింగ్ వర్క్ అవుట్ చేస్తున్న వీడియోను షేర్ చేసింది త్రిష. దానికి 'మార్నింగ్ షైనింగ్స్' అనే క్యాప్షన్ కూడా రాసుకొచ్చింది.

దీంతో 40ఏళ్ల వయసులో కూడా ఆమె అందం ఏ మాత్రం తగ్గలేదని, త్రిష తగ్గేదే లే అంటూ కామెంట్స్ పెడుతున్నారు. ఇక ఈ వీడియోలో తనతో పాటు తన కుక్కపిల్లతో కూడా వర్క్ అవుట్స్ చేయించడం పట్ల సరదాగా రియాక్ట్ అవుతున్నారు. 22 ఏళ్లుగా హీరోయిన్ గా నటిస్తున్నా కూడా అన్ స్టాపబుల్ గా దూసుకుపోతుందని త్రిష ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
ప్రస్తుతం ఈ బ్యూటీ తమిళంలో హీరో అజిత్ కి జోడిగా గుడ్ బ్యాడ్ అగ్లీ అనే సినిమాలో నటిస్తుంది. అలానే తెలుగులో మెగాస్టార్ చిరంజీవి సరసన విశ్వంభర మూవీలో యాక్ట్ చేస్తోంది. కమర్షియల్ సినిమాలే కాకుండా లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లోనూ నటిస్తుంది. ఎక్కువగా ఆమె తమిళ్ సినిమాల పైనే ఫోకస్ పెట్టింది ఈ ముద్దుగుమ్మ.












Click it and Unblock the Notifications